NTV Telugu Site icon

Barcode: నవజాత శిశువును విసిరేసిన తల్లి.. “బార్‌కోడ్” సాయంతో పట్టుకున్న పోలీసులు..

Kerala

Kerala

Barcode: పెళ్లికి ముందే ఓ బిడ్డకు జన్మనిచ్చి, ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు 23 ఏళ్ల విద్యార్థిని దారుణంగా ప్రవర్తించింది. 5వ అంతస్తు నుంచి శిశువుని ఓ కవర్‌లో చుట్టి రోడ్డుపై విసిరేసింది. ఈ ఘటన కొచ్చి నగరంలోని విద్యానగర్‌లో చోటు చేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ సంఘటన కేరళలో సంచలనంగా మారింది. అయితే, చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేవలం మూడు గంటల్లోనే నిందితురాలైన తల్లిని పట్టుకున్నారు. పోలీసుల విచారణకు, నిందితురాలని గుర్తించేందుకు ‘‘బార్‌‌కోడ్’’ ఉపయోగపడింది.

శిశువుని ఓ కవర్‌లో చుట్టి బయటకు విసరేసింది. అయితే, ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ యొక్క బార్‌కోడ్ ఆ కవర్‌పై ఉండటంతో పోలీసుల విచారణ సులువైంది. శుక్రవాం ఉదయం 8.-8.15 గంటల ప్రాంతంలో ఓ కవర్ పై అంతస్తు నుంచి రోడ్డుపై పడినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజీలో కూడా అపార్ట్మెంట్ నుంచి కవర్ బయటకు విసిరేసినట్లు కనిపించింది. కవర్‌పై ఉన్న బార్‌కోడ్ స్కాన్ చేయగా, నిందితురాలైన తల్లి చిరునామాకు నేరుగా తీసుకెళ్లింది. విచారణలో తానే నేరాన్ని చేసినట్లు ఒప్పుకుంది.

Read Also: Brinda Karat: బీజేపీ ఊహలు గ్యాస్ బుడగల్లా ఉన్నాయి.. చివరకు పేలిపోక తప్పదు

ఆమె గదిని తనిఖీ చేయగా రక్తపు మరకల లాంటి గుర్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సదరు మహిళ తల్లిదండ్రులు సరుకులను ఆర్డర్ పెట్టినట్లు తెలిసింది. అయితే, తమ కూతురు గర్భంతో ఉన్నట్లు, ప్రసవించినట్లు వారికి తెలియదు. శిశువుకు జన్మనిచ్చిన తర్వాత శిశువు ఏడుపుతో ఉక్కిరిబిక్కిరి అయినట్లు, ఏడుపును ఆపేందుకు బట్టలను ఉపయోగించినట్లు నిందితురాలు వెల్లడించింది, శుక్రవారం తెల్లవారుజామున 5-5.30 గంటల ప్రాంతంలో బాత్‌రూంలో బిడ్డకు జన్మనిచ్చిందని, అయితే ఆ సమయంలో ఆమె తల్లి బెడ్రూం తలుపు తట్టడంతో భయాందోళనకు గురై శిశును విసిరేసినట్లు మహిళ చెప్పిందిన పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం, శిశువు గొంతు నులమడం వల్ల మరణించాడు. పిల్లాడి పుర్రెలో పగుళ్లు ఉన్నాయి.

ప్రస్తుతం మహిళ చికిత్స పొందుతోంది. త్రిసూర్‌కి చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పరియమైనట్లు వెల్లడించింది. ఇది అత్యాచారమా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి రావల్సి ఉంది. నవజాత శిశువును హత్య చేసినందుకు నిందితురాలైన తల్లికి ఎర్నాకుళం అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.