Site icon NTV Telugu

Sadistic Husband: భార్య ఆత్మహత్యను వీడియో తీసిన భర్త!

Sadistic Husband

Sadistic Husband

Sadistic Husband: భర్తతో గొడవపడి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దారుణ ఘటన కాన్పూర్‌లో వెలుగుచూసింది. మరింత షాకింగ్ విషయం ఏమిటంటే, తన భార్య ఆత్మహత్యకు పాల్పడుతున్న ఆపకుండా దానిని తన సెల్‌ఫోన్‌ తో వీడియోను భర్త తీశాడు. భర్త వీడియోను రికార్డు చేస్తున్నాడని తెలిసి కిందికి దిగిన భార్య అతనితో మళ్లీ గొడవ పడి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వీడియోను ట్వీట్టర్‌, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో కలకలం రేపుతోంది.

యేహీ తుమ్హారీ సోచ్ హై. బహుత్ ఖరాబ్ సోచ్ హై (ఇది నీ ఆలోచన. నీది దుర్మార్గమైన ఆలోచన)” అని ఆ వ్యక్తి వీడియోలో చెప్పడం వినవచ్చు. తరువాత ఆమె ఉచ్చు తీసి అతని వైపు చూసింది. ఆ సమయంలో వీడియో ముగిసింది.

Read also: Whatsapp New Feature: వాట్సాప్‌ మరో అదిరిపోయే ఫీచర్.. ఇక నో టెన్షన్‌..!

మృతురాలిని శోబితా గుప్తాగా గుర్తించారు. ఆమె తన భర్త సంజీవ్ గుప్తాతో గొడవ పడింది, సంఘటన జరిగిన తరువాత, సంజీవ్, శోబిత తల్లిదండ్రులకు సమాచారం అందించాడు, వారు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత ఆమె మృతదేహం మంచంపై పడివుంది. మృతురాలి బంధువులు మాట్లాడుతూ.. మేము ఇంటికి చేరుకున్నప్పుడు, మా కుమార్తె మృతదేహం మంచం మీద పడి ఉంది. సంజీవ్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అలాగే కూర్చున్నాడు మేము వెంటనే ఆమెను తీసుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాము. తనకూతురు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని పేర్కొన్నారు. తనకు ఏమీ తెలియదు అన్నట్లు సంజీవ్ తీసిన వీడియో వారికి ఇచ్చాడని, ఆమె ఇంతకు ముందు ఉరి వేసుకోవడానికి ప్రయత్నించిందని అతను మాతో చెప్పాడని తండ్రి రాజ్‌కిషోర్ గుప్తా చెప్పారు. అయితే.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న యూపీ పోలీసులు భర్తను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.

Exit mobile version