Site icon NTV Telugu

Honeymoon Murder Case: సోనమ్‌కు మరణశిక్ష విధించాలి..రాజా రఘువంశీ కుటుంబం..

Drugs Hyderabad

Drugs Hyderabad

Honeymoon Murder Case: ‘‘హనీమూన్ మర్డర్ కేసు’’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. భర్త రాజా రఘువంశీని, భార్య సోనమ్ మేఘాలయకు తీసుకెళ్లి, కిరాయి హంతకులతో హత్య చేయించింది. సోమన్‌కు రాజ్ కుశ్వాహా అనే వ్యక్తితో ఎఫైర్ ఉంది. దీంతో ఇద్దరు కలిసి ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీని హత్య చేశారు. వీరితో పాటు విశాల్ సింగ్ చౌహాన్, ఆకాష్ సింగ్ రాజ్‌పుత్, ఆనంద్ కుర్మిలు నిందితులుగా ఉన్నారు. మొత్తం ఈ కేసులో 8 మందిపై మేఘాలయ పోలీసులు శుక్రవారం 790 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు.

రఘువంశీ హత్యకు నేరపూరిత కుట్ర, సాక్ష్యాలను నాశనం చేసినందుకు భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద వారిపై అభియోగాలు మోపారు. అయితే, ఈ కేసులో రాజా రఘువంశీ కుటుంబం సోనమ్‌తో పాటు నిందితులకు మరణశిక్ష విధించాలని కోరింది. రాజా రఘువంశీ అన్న విపిన్ మాట్లాడుతూ.. ‘‘ నా కుటుంబానికి ఒకటే డిమాండ్ ఉంది. సోనమ్, రాజ్ కుశ్వాతో సాటు ఐదుగురు నిందితులకు మరణశిక్ష విధించాలి.’’ అని ఇండోర్‌లో అన్నారు.

Read Also: Sandeep Reddy : బాహుబలి-2లో ప్రభాస్ ను చూసి భయపడ్డా.. సందీప్ కామెంట్స్

ఈ కేసులో సోనమ్ కుటుంబం కూడా రాజా రఘువంశీ కుటుంబానికి మద్దతు ఇచ్చింది. తన సోదరితో సంబంధాలు తెంచుకున్నట్లు ఆమె అన్న గోవింద్ ఇదివరకే చెప్పారు. రాజా రఘువంశీకి న్యాయం జరిగేలా చట్టపరమైన పోరాటం చేస్తామని ప్రకటించారు. అయితే, సోనమ్ అన్న విపిన్ తన సొంత ప్రయోజనాలనెు కాపాడుకునేందుకు అబద్ధం చెబుతున్నారని విపిన్ ఆరోపించారు. గోవింద్ మా కుటుంబంతో ఉన్నామని చెబుతూనే, సోనమ్ కోసం వాదించేందుకు న్యాయవాదిని నియమించుకున్నాడని చెప్పారు.

మే 21న హనీమూన్ కోసం రాజా రఘువంశీ, ఆయన భార్య సోనమ్ మేఘాలయకు వెళ్లారు. మే 26న ఈ జంట కనిపించడం లేదని ఫిర్యాదు అందింది. దీంతో మేఘాలయ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక గ్రామస్తులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. జూన్ 2న సోహ్రాలోని ఓ జలపాత వద్ద లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత విచారణలో సోనమ్ పోలీసుల ముందు లొంగిపోయింది. సోనమ్‌కు ఆమె ప్రియుడితో సంబంధం ఉండటంతోనే హత్య జరిగినట్లు విచారణలో వెల్లడైంది.

Exit mobile version