Site icon NTV Telugu

Honeymoon Murder: రాజా రఘువంశీ హత్యలో మరో ట్విస్ట్.. కొత్త వ్యక్తికి 119 సార్లు కాల్ చేసిన సోనమ్..

Sonam Raghuvanshi

Sonam Raghuvanshi

Honeymoon Murder: హనీమూన్ మర్డర్ కేసులో మరో బిట్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో లేని కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా ప్లాన్ చేసి, హత్య కోసం కిరాయి హంతకులను నియమించుకున్నారు. మేఘాలయ హనీమూన్‌కి వెళ్లిన సమయంలో భార్య సోనమ్ దగ్గర ఉండీ తన భర్త రాజాను హత్య చేయించింది.

Read ALSO: CM Revanth Reddy: బ్రహ్మోస్ ఏరోస్పేస్ విస్తరణకు తెలంగాణను ఎంచుకోండి..

ఈ కేసుకు సంబంధించి పోలీసు దర్యాప్తులో సోనమ్ కాల్ డేటాను విశ్లేషించగా మరో పేరు బయటకు వచ్చింది. సంజయ్ వర్మ అనే వ్యక్తికి సోనమ్ మార్చి 1 నుంచి మార్చి 25 వరకు 119 కాల్స్ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం, అతడి మొబైల్ నెంబర్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. ఇద్దరి మధ్య జరిగిన ఈ ఫోన్ సంభాషణలపై ఇప్పుడు పోలీసులు దృష్టిసారించారు.

మే 23న మేఘాలయాలోని తూర్పు ఖాసీ హిల్స్‌లో రాజాను హత్య చేశారు. వీ సావ్‌డాంగ్ జలపాతం సమీపంలోని లోయలో అతడి మృతదేహాన్ని జూన్ 02న గుర్తించారు. ఆ తర్వాత, జూన్ 08 సోనమ్ ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపూర్ పోలీసుల ముందు లొంగిపోయింది. ఈ కేసులో రాజాను ముందుగా దావో అనే పిలిచే కత్తితో హత్య చేశారు. హత్య జరుగుతున్న సమయంలో సోనమ్ అక్కడే ఉందని, ఆమె భర్తపై దాడి తర్వాత అతను కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయిందని, ఆ తర్వాత మరికొన్ని కత్తి దాడుల తర్వాత రాజా రఘువంశీ చనిపోయినట్లు హంతకుల్లో ఒకరై విశాల్ సింగ్ పోలీసులకు చెప్పాడు.

Exit mobile version