Site icon NTV Telugu

Basavalinga Swamy Suicide: మఠాధిపతి సూసైడ్ కేసులో ట్విస్ట్.. తెరవెనుక హనీట్రాప్

Basavalinga Swamy Honey Tra

Basavalinga Swamy Honey Tra

Honey Trap Behind Basavalinga Swamy Suicide: కర్ణాటకలో సంచలనం సృష్టించిన బసవలింగ స్వామి(45) అనే మఠాధిపతి ఆత్మహత్య కేసులో తాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసుని సీరియస్‌గా తీసుకొని పోలీసులు విచారించిగా.. తెరవెనుక హనీట్రాప్ వ్యవహారం ఉందన్న విషయం బట్టబయలైంది. ఒక మహిళతో ఆయన న్యూడ్ వీడియో కాల్స్ చేశారని, మరో మహిళ ఆ దృశ్యాల్ని తన ఫోన్‌లో రికార్డ్ చేసిందని పోలీసులు తెలిపారు. ఆ రికార్డ్ చేసిన వీడియోలతో మఠాధిపతిని బ్లాక్‌మెయిల్ చేశారని చెప్పారు. ఇదే విషయాన్ని బసవలింగ స్వామి తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. తనని పీఠాధిపతిగా తొలగించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని, అందులో భాగంగానే ఒక మహిళతో న్యూడ్ వీడియో కాల్స్ చేయించారని ఆ నోల్‌లో రాశారు. బసవలింగ స్వామి ఆత్మహత్యకు ఆ బెదిరింపులే కారణమని పోలీసులు తేల్చారు.

నాలుగు అసభ్యకర వీడియోలను రిలీజ్ చేసి.. ఒక మహిళతో పాటు మరికొందరు బసవలింగ స్వామిని వేధించారని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తులకు సంబంధించిన వివరాలు తమ వద్ద ఉన్నాయని చెప్పిన పోలీసులు.. వారి వివరాల్ని మాత్రం రివీల్ చేయలేదు. బసవలింగ స్వామి ఆత్మహత్య వెనుక.. మఠంలోని, మఠం వెలుపలి రాజకీయాలు కారణం అయ్యుండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కొందరు పీఠాధిపతులకు రాజకీయ నాయకులతో బలమైన పరిచయాలు ఉన్నాయని.. వీరు ఇతర పీఠాధిపతులను దెబ్బతీసేలా వ్యవహరిస్తుంటారని తమ విచారణలో తేలిందని అన్నారు. అయితే.. బసవలింగ స్వామి ఆత్మహత్య వెనుక రాజకీయ కారణాలేవీ లేవని, హనీట్రాప్ చేశారన్న మాట మాత్రం వాస్తవమని వెల్లడించారు. తాము అన్ని కోణాల్లోనూ ఈ కేసుని విచారిస్తున్నామని.. అసలు కారణాలేంటో తెలుసుకునేంతవరకు వెనకడుగు వేయమని తేల్చి చెప్పారు.

కాగా.. కంచుగల్ మఠానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ మఠానికి 1997లో బసవలింగ స్వామి ప్రధాన పీఠాధిపతిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి.. అంటే దాదాపు 25 సంవత్సరాల నుంచి ఆయన ఈ మఠానికి అధిపతిగా కొనసాగుతున్నారు. కానీ, ఇప్పుడు హనీట్రాప్‌లో పడి ప్రాణాలు కోల్పోయారు. అటు.. రెండు నెలల క్రితం కర్ణాటకలోనే బసవ సిద్ధలింగ స్వామి అనే మరో మఠాధిపతి కూడా సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే!

Exit mobile version