Bee Warriors: భారత-బంగ్లాదేశ్ సరిహద్దు రక్షకులుగా తేనెటీగలు.. పైలట్ ప్రాజెక్ట్‌కు బీఎస్ఎఫ్ శ్రీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇకపై దేశంలోకి అక్రమ చోరబాట్లు లేకుండ భారత సరిహద్దు వద్ద తేనె టీగలు రక్షణగా ఉండబోతున్నాయి. ఈ మేరకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సన్నాహాలు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ కింద సరిహద్దుల్లో తేనె టీగలను కాపలాగా ఉంచబోతుంది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మాత్రం పెద్ద ఎత్తున తేనె టీగల పెంపకాన్ని బీఎస్ఎప్ చేపట్టనుంది. అయితే ముందుగా ఈ ప్రాజెక్ట్‌ను భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చేపట్టారు. ఎందుకంటే ఈ సరిహద్దుల్లోనే అక్రమ చోరబాట్లు ఎక్కువ. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు తరచూ అక్రమంగా చొరబడుతుంటారు.
Also Read: PM Modi: క్రిస్మస్ రోజున ప్రధాని నివాసాన్ని సందర్శించిన బాలికలు.. వీడియో షేర్ చేసిన మోదీ
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
ఈ క్రమంలో చాలా మందిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఇది ఫెయిల్ అయ్యి అక్రమంగా దేశంలోకి చోరబడుతున్నారు. అందుకే ఇకపై భారత్-బంగ్లా సరిహద్దుల్లో చోరబాటుదారులను తిప్పికొట్టే బాధ్యతను తేనెటీగలు చూసుకునేలా బీఎస్ఎఫ్ ప్లాన్ చేసింది. ఈ మేరకు సరిహద్దులో భారీ ఎత్తున తేనె టీగల పెంపకాన్ని చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ చొరవతో బీఎస్ఎఫ్ ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. బార్డర్ వద్ద ఉన్న కంచెలకు బాక్సులు ఏర్పాటు చేసి అందులో తేనె టీగల పెంపకాన్ని ప్రారంభించారు. ఎవరైనా ఈ ముళ్ల తీగను దాటడానికి ప్రయత్నిస్తే వారిని తేనె టీగలు తిప్పికొడతాయి.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా బీఎస్ఎఫ్ భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉన్న 4.96 కి.మీ పొడవైన సరిహద్దు వద్ద ముళ్ల తీగలు ఏర్పాటు చేసింది. సరిహద్దు భద్రతా దళ సిబ్బంది ఈ ముళ్ల తీగలపై తేనెటీగలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఛప్రా, బాన్‌పూర్, కడిపూర్, అంచాస్ సరిహద్దుల్లో 200 బాక్సుల తేనెటీగల పెంపకాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం సరిహద్దులోని ముళ్ల కంచెలో తేనెటీగలు ఇష్టపడే కొన్ని పూల మొక్కలను కూడా పెంచుతున్నారు. ఇక్కడే తేనెటీగల పెంపకం పెట్టె ఇక్కడ ఉంచుతున్నారు.
తేనెటీగలకు ఇక్కడ వాతావరణం చాలా సహజంగా కనిపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. వైబ్రంట్ విలేజ్‌లో తరహాలో ఈ తేనెటీగల పెంపకం పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద, భారతదేశం, బంగ్లాదేశ్ సరిహద్దులను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసింది. తద్వారా తేనె టీగలు చొరబాటు ప్రయత్నాలను తగ్గిస్తాయో లేదో చూడాల్సి ఉంటుందని బీఎస్ఎఫ్ పేర్కొంది. కృష్ణగంజ్ ప్రాంతంలో బీఎస్ఎఫ్ 20 తేనే తీగల బాక్సులను ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. ఇక్కడ ఈ పెట్టెల నిర్వహణ బాధ్యతను స్థానిక ప్రజలు తీసుకుంటారు. తేనెను సేకరించే బాధ్యత కూడా వారే తీసుకుంటారు. కాబ్టటి ఈ ప్రాజెక్ట్ వల్ల ఆర్థికంగా కూడా ప్రయోజనం పొందుతారు.
Also Read: Kishan Reddy : ఇండియా కూటమితో దేశ సమగ్రతకు ముప్పు
చొరబాట్లను తేనెటీగలు ఎలా ఆపుతాయంటే..
తేనేతీగలను పెంచే బాక్సులను బార్డర్‌లో ఉంచుతారు. సరిహద్దులో చోరబాటుదారులు వచ్చే క్రమంలో ముళ్ల కంచే తీగలు కదలుతాయి కాబట్టి. అప్పుడు తేనెటీగల బాక్సులు కూడా కదులుతాయి. దీంతో తేనెటీగలు ఒక్కసారిగా లేచి చోరబాటుదారులపై దాడి చేస్తాయని బీఎస్ఎఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఆఫ్ సౌత్ బెంగాల్ బోర్డర్ డీఐజీ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తేనెటీగలు.. ముళ్ల తీగ దగ్గరకు వచ్చేవారికి పెద్ద ప్రమాదమన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద తేనెటీగల పెంపకం జరుగుతుందని, ఈ ప్రయోగం విజయవంతమైతే రానున్న రోజుల్లో ఇతర సరిహద్దుల్లోనూ ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను చేపడతామాని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!