Site icon NTV Telugu

Liquor Home Delivery: త్వరలోనే స్విగ్గీ, జొమాటోలో లిక్కర్ హోమ్ డెలివరీ..?

Liqour

Liqour

Liquor Home Delivery: లిక్కర్ కోసం ఇకపై పబ్బులు, వైన్స్ లు, బార్లకు వెళ్లాల్సిన పని లేకుండా పోయింది మందు బాబులకు.. ఆన్ లైన్ లో ఫుడ్, ఇతర వస్తువులను ఆర్డర్ చేసుకుంటే వాటిని ఇంటి దగ్గరకే తెచ్చి ఇస్తున్నట్లుగా త్వరలోనే లిక్కర్ ను కూడా హోమ్ డెలివరీ చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ లాంటి ఆన్ లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా త్వలోనే లిక్కర్ హోమ్ డెలివరీ చేయాలని మద్యం తయారీ దారులు ఆలోచన చేస్తున్నారు. ఈ తరహా మద్యం హోమ్ డెలివరీ చేసే విధానం ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో అమలు జరుగుతుండగా.. త్వరలో ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హర్యానా, పంజాబ్, గోవా లాంటి రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జాతీయ మీడియాలో న్యూస్ ప్రచారం జరుగుతుంది.

Read Also: Vishwak sen: షూటింగ్ పూర్తి కాకుండానే రైట్స్ సేల్..రిలీజ్ ఫిక్స్..

కాగా, స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ లాంటి ప్లాట్‌ఫారమ్‌లు ద్వారా బీర్, వైన్ లాంటి మద్యాన్ని తక్కువ స్థాయిలో హోమ్ డెలివరీ చేయవచ్చని తెలిపింది. ఈ విధానం ద్వారా లాభ నష్టాలను అంచనా వేసుకుని త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ జోరుగా కొనసాగుతుంది. కాగా కోవిడ్ -19 టైంలో మహారాష్ట్ర, జార్ఖండ్, చత్తీస్ గఢ్, అస్సాంలో తాత్కాలికంగా మద్యం హోమ్ డెలివరీకి ఆయా ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ఆన్ లైన్ డెలివరీల ద్వారా అమ్మకాలు 20- 30 శాతం పెరిగినట్లు రిటైల్ పరిశ్రమల అధికారులు వెల్లడించారు. కాగా, గతంలో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాచేసిన సర్వేలో 100 శాతం మంది హైదరాబాదీలు మద్యం హోం డెలివరీ సేవలు స్టార్ట్ చేయాలని కోరినట్లు వెల్లడించారు.

Exit mobile version