NTV Telugu Site icon

HMPV Virus: భారత్‌లో 6కి చేరిన HMPV కేసులు.. ఎక్కడంటే..

Hmpv

Hmpv

HMPV Virus: చైనాలో ప్రారంభమైన కొత్త వైరస్ ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV)’’ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. చైనాలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పొరుగుదేశాలు ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఇండియాలో HMPV వైరస్ కేసుల సంఖ్య 6కి చేరింది. ఈ ఒక్క రోజే ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా కోల్‌కతాలో 5 నెలల చిన్నారికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. చెన్నైలో మరో ఇద్దరు పిల్లలకు కూడా ఈ వైరస్ సోకినట్లు తేలుస్తోంది. అయితే, కొత్తగా నమోదైన కేసులను ఇంకా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

Read Also: Hyderabad: ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

అంతకుముందు, ఈ రోజు బెంగళూర్‌లో 3, 8 నెలల వయసు ఉన్న ఇద్దరు చిన్నారులకు వైరస్ నిర్ధారణ కాగా, అహ్మదాబాద్‌లో రెండు నెలల బాలుడికి వైరస్ సోకినట్లు తేలింది. బెంగళూర్‌లో 3 నెలల చిన్నారి వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. మరో చిన్నారి చికిత్స పొందుతోంది.

Show comments