Site icon NTV Telugu

Hindu Population: భారత్‌లో 8 శాతం తగ్గిన హిందూ జనాభా వాటా.. మైనారిటీల సంఖ్యలో పెరుగుదల..

Hindus

Hindus

Hindu Population: 1950-2015 మధ్య భారతదేశంలో మెజారిటీ (హిదువుల) మతాల వాటా 7.8 శాతం తగ్గిందని, అనేక పొరుగు దేశాల్లో మెజారిటీ మతం(ఇస్లాం) వాటా పెరిగిందని ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్(EAC-PM) అధ్యయనం వెల్లడించింది. భారతదేశంలో హిందూ జనాభా తగ్గిపోగా, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, సిక్కులతో సహా మైనారిటీ వాటా పెరిగిందని చెప్పింది. అయినప్పటికీ జైనులు, పార్సీల సంఖ్య తగ్గినట్లు వెల్లడించింది. 1950-2015 మధ్య దేశంలో ముస్లిం జనాభా వాటా 43.15 శాతం పెరిగిందని, క్రైస్తవుల్లో 5.38 శాతం, సిక్కులు 6.58 శాతం పెరుగులను చూశారని నివేదికే వెల్లడించింది.

EAC-PM ప్రకారం, భారతదేశంలో హిందువుల వాటా 1950లో 84 శాతం ఉంటే 2015లో 78 శాతానికి తగ్గింది. అదే సమయంలో ముస్లింల సంఖ్య 9.84 శాతం నుంచి 14.19 శాతానికి పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది. భారత్‌లోనే కాకుండా నేపాల్ లో మెజారిటీ(హిందూ) మతం జనాభా దాని వాటాలో 3.6 శాతం క్షీణతను చూసింది. మే 2024లో విడుదల చేసిన ఈ అధ్యయనం, ప్రపంచవ్యాప్తంగా 167 దేశాలను ట్రెండ్స్‌ని అంచనా వేసింది. డేటాను జాగ్రత్తగా విశ్లేషించడం ద్వారా భారత్‌లో మైనారిటీలు కేవలం రక్షించబడటమే కాకుండా, అభివృద్ధి చెందుతున్నారని అధ్యయన రచయితలు చెప్పారు.

Read Also: Bastar: The Naxal Story OTT: ఓటీటీలో ఆదాశర్మ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

పాక్, బంగ్లాలో పెరిగిన ముస్లిం జనాభా:

ఇదిలా ఉంటే భారత్ సరిహద్దు ముస్లిం మెజారిటీ దేశాలుగా ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో మెజారిటీ(ముస్లిం) మతం జనాభా పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది. బంగ్లాదేశ్‌లో అత్యధికంగా 18.5 శాతం, పాకిస్తాన్‌లో 3.75 శాతం, ఆఫ్ఘనిస్తాన్‌లో 0.29 శాతం మెజారిటీ మతం వాటా పెరిగింది. ఇదిలా ఉంటే మరో పొరుగు దేశం మయన్మార్‌లో కూడా మెజారిటీ కమ్యూనిటీ వాటాలో క్షీణత చూసినట్లు, మయన్మార్‌లో థెరవాడ బౌద్ధుల మెజారిటీ జనాభా 65 ఏళ్లలో 10 శాతం తగ్గింది. ఇక మాల్దీవుల్లో మెజారిటీ గ్రూపు(షఫీ సున్నీలు) వాటా 1.47 శాతం క్షీణించింది. ఇక భారత పొరుగు దేశాలైన భూటాన్, శ్రీలంకలో మెజారిటీ బౌద్ధ జనాభా వరసగా 17.6 శాతం, 5.25 శాతం పెరిగింది.

మొత్తం జనాభాలో మైనారిటీల నిష్ఫత్తి మార్పు దేశంలో మైనారిటీల స్థితిని తెసుకునేందుకు పనిచేస్తుందని, ఇది మైనారిటీలను నిర్వచించడం, పాలసీల రూపకల్పనను ప్రోత్సహిస్తుందని, ఇది ప్రపంచవ్యాప్తంగా అరుదైన పద్ధతి అని అధ్యయనం తెలిపింది.

Read Also: Raghunandan Rao : వెంకట్రామిరెడ్డి ఎన్ని కోట్లు ఇస్తే కేసీఆర్ మెదక్ సీటు ఇచ్చిండు

క్షీణిస్తున్న మెజారిటీ..

ప్రపంచవ్యాప్తంగా భారత్ మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా మెజారిటీ వాటా క్షీణిస్తున్నట్లు అధ్యయనం వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో ఆస్ట్రేలియా, చైనా, కెనడా, న్యూజిలాండ్ వంటి దేశాలు, తూర్పు ఆఫ్రికా దేశాలలో మెజారిటీ కమ్యూనిటీ వాటా భారత్ కన్నా ఎక్కువగా పడిపోయింది. 1950-2015 నుండి 167 దేశాలలో మెజారిటీ మతపరమైన తెగల వాటా సగటున 22% తగ్గింది. లైబీరియాలో 99 శాతం తగ్గితే, నమీబియాలో 80 శాతం మెజారిటీ వాటా పెరిగింది. 123 దేశాల్లో మెజారిటీ కమ్యూనిటీ వాటా తగ్గినట్లు అధ్యయనం పేర్కొంది.

35 అధిక ఆదాయ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD) దేశాలు మెజారిటీ మతాల నిష్పత్తిలో 29 శాతం గణనీయమైన సగటు క్షీణతను చూసాయి, ఇది ప్రపంచ సగటు 22 శాతం కన్నా ఎక్కువ. భారతదేశ ధోరణి సమాజంలో వైవిధ్యాన్ని పెంపొందించడాని అనువైన వాతావరణం ఉందని రచయితలు చెప్పారు. మైనారిటీల జీవితాలను మెరుగుపరచడానికి భారతదేశం యొక్క విధానాలు మరియు సంస్థలను అధ్యయనం ప్రశంసించింది. ప్రగతిశీల విధానాలు మరియు సమ్మిళిత సంస్థల ఫలితాలు భారతదేశంలో పెరుగుతున్న మైనారిటీ జనాభాలో ప్రతిబింబిస్తాయి స్టడీ రచయితలు వెల్లడించారు.

Exit mobile version