Jama Masjid: ఆగ్రాలోని జామా మసీద్ మెట్ల కింద పాతిపెట్టిన విగ్రహాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని హిందూ ట్రస్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శ్రీ కృష్ణ జన్మభూమి సంరక్షిత సేవా ట్రస్ట్ ఆగ్రాలోని జామా మసీదు మెట్ల క్రింద ఉన్న భగవాన్ కేశవదేవ్ విగ్రహాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతూ.. పిటిషన్ దాఖలు చేసింది.
పిటిషన్ స్వీకరించిన సివిల్ జడ్జ్ పిటిషన్ స్వీకరించారు. ప్రతివాదులకు నోటీసుకు కూడా జారీ చేసింది. మే 31లోగా వారు స్పందించాలని కోర్టు నోటీసులు పంపింది. ఈ కేసులో షాహీ మసీదు ఆగ్రా కోటకు చెందిన ఇంతజామియా కమిటీ, ఛోటీ మసీదు దివాన్-ఎ-ఖాస్, జహనారా బేగం మసీదు ఆగ్రా కోట కార్యదర్శి, యూపీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్, శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. మే 11న శ్రీ కృష్ణ జన్మభూమి సంరక్షిత సేవా ట్రస్ట్ చైర్మన్ మనోజ్ కుమార్ పాండే ఈ కేసును దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని స్వీకరించిన కోర్టు మే 31 లోగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది.
Read Also: Tesla: భారత్ వైపు టెస్లా చూపు.. ఈ వారం ఇండియాకు టెస్లా టీం..
మధురకు చెందిన మత బోధకుడు దేవకినందన్ ఠాకూర్ ట్రస్ట్‌కు పోషకుడిగా ఉన్నారు. ఇటీవల ఆయన ఆగ్రాలో ‘భగవత్ కథ’ నిర్వహించారు. కేశవదేశ్ విగ్రహాలను హిందువుల చేతులతో పునరుద్ధరించాలని ఈ కార్యక్రమంలో ఆయన డిమాండ్ చేశారు. పిటిషన్ దాఖలు చేసిన మనోజ్ పాండే మాట్లాడుతూ.. మసీదు మెట్ల కింద శ్రీకృష్ణుని విగ్రహాలను పూడ్చిపెట్టినట్లు అనేక ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నాడు. మొఘల్ పాలకుడు ఔరంగజేబు హయాంలో రాసిన పుస్తకంలోని విషయాలు తన వద్ద ఉన్నాయని, వాటిని కోర్టులో హాజరు పరుస్తానని చెప్పాడు.
మెట్లను తవ్వినందుకు, వాటిని మళ్లీ యథాతథ స్థితికి తీసుకురావడనానికి అయ్యే ఖర్చులన్నింటినీ ట్రస్ట్ భరించడానికి సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నాడు. ఔరంగజేబు 1670లో కేశవదేవ్ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆగ్రాలోని జామా మసీదు మెట్ల కింద కేశవదేవ్ విగ్రహాన్ని పాతిపెట్టాడని అనేక చారిత్రక నివేదికలు రుజువు చేశాయని మనోజ్ పాండే చెప్పారు. ట్రస్ట్ లీగల్ టీంలో బ్రజేంద్ర సింగ్ రావత్, వినోద్ శుక్లా, కృష్ణ రావత్, దిలీప్ దూబే, నితిన్ శర్మ, ఇతరులు ఉన్నారు.