NTV Telugu Site icon

Hindu Terrorism: హిందూ టెర్రరిజం అనేది లేదు.. ఆర్టీఐలో వెల్లడి.

Home Ministry

Home Ministry

Hindu terrorism does not exist, says MHA in RTI: భారతదేశంలో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి సమాచారం కోరుతూ.. ఆర్టీఐ కార్యకర్త ప్రపుల్ సర్దా హోంమంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేశారు. అయితే ఇదే విధంగా భారతదేశంలో కాషాయ ఉగ్రవాదం, హిందూ ఉగ్రవాదం గురించి సమాచారాన్ని కోరారు. కాగా, భారతదేశంలో హిందూ ఉగ్రవాదం, కాషాయ ఉగ్రవాదం లేవని స్పష్టం చేసింది హోం శాఖ. దీనిపై స్పందించిన ప్రఫుల్ సర్దా.. బుజ్జగింపు రాజకీయాల కోసం ఈ పదాన్ని సృష్టించారని అన్నారు. ఇదే విధంగా ఇస్లామిక్ ఉగ్రవాదం, భారతదేశంలో జరిగిన బాంబు పేలుళ్లలో వీటి ప్రమేయం ఉందా..? అని కేంద్ర హోం శాఖను ఆర్టీఐ ద్వారా కోరారు.

Read Also: Stampede In Cuttack: జాతరలో తొక్కిసలాట.. ఒకరు మృతి, 20 మందికి గాయాలు

2006 మాలేగావ్ పేలుడు కేసులో కాషాయ, హిందు ఉగ్రవాదుల ప్రమేయం గురించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రికార్డుల గురించి సర్దా ఆరా తీశారు. ఈ సమాచారంపై సర్దా మాట్లాడారు. నేను భారతీయుడినే కాకుండా.. హిందువుగా కూడా చాలా బాధపడ్డానని.. ఒక నిర్దిష్ట సమాజం ఓట్లను పొందడానికి రాజకీయ నాయకులు కాషాయ ఉగ్రవాదం వంటి పదాలను సృష్టించి, హిందువుల ప్రతిష్టకు భంగం కలిగించారని అన్నారు. ఆర్టీఐ సమాచారం ప్రకారం, హిందూ ఉగ్రవాదం అనేది ఉనికిలో లేదని.. ఇస్లామిక్ ఉగ్రవాదం ఉనికిలో ఉందని, ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను చంపడం ద్వారా ఇబ్బందులు కలిగిస్తుందని సర్దా అన్నారు. ఆర్టీఐ ప్రకారం.. చట్టవిరుద్ద కార్యకలాపాల(నివారణ) చట్టం(యూఏపీఏ)-1967 ప్రకారం దేశంలో 42 సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించారు. యూఏపీఏ చట్టానికి 2019లో మరిన్ని సవరణలు చేసి మరింత పకడ్బందీగా తీర్చిదిద్దినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Show comments