Site icon NTV Telugu

Supreme Court: హిందూ వివాహం అంటే “పాటలు, డ్యాన్సులు” కాదు.. ఆచార వ్యవహారాలు ఉంటేనే చెల్లుబాటు..

Hindu Marraige

Hindu Marraige

Supreme Court: హిందూ వివాహ గొప్పతతాన్ని గుర్తిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడం వల్ల వివాహానికి రుజువు లభిస్తుంది, అయితే చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం వివాహానికి చట్టబద్ధత లభించదని జస్టిస్ నాగరత్న, ఆగస్టిన్ జార్జ్ మహిహ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. సెక్షన్ 7 చెల్లుబాటు అయ్యే హిందూ వివాహ వేడుక ఆవశ్యకతను నొక్కి చెబుతుందని కోర్టు పేర్కొంది. హిందూ వివాహం చెల్లుబాటు కావాలంటే, ఆ పెళ్లి తగిన ఆచారాలు, వేడుకతో నిర్వహించాలని కోర్టు నొక్కి చెప్పింది. సప్తపది(పవిత్రమైన అగ్ని చుట్టూ ఏడు అడుగులు) వంటి ఆచారాలు వివాదాల సమయంలో రుజువుగా అవసరమని ధర్మాసనం పేర్కొంది. సరైన వివాహ వేడుకలు జరగకుండా ఇద్దరు పైలెట్ల జంట విడాకులు కోరిన కేసులో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో వారి విడాకుల ప్రక్రియను మరియు భర్త మరియు అతని కుటుంబ సభ్యులపై నమోదైన కట్నం కేసును కూడా రద్దు చేసింది.

Read Also: Rinku Singh: తుది జట్టులో లేనని తెలిసి గుండె పగిలినట్లైంది.. తల్లితో రింకూ సింగ్ భావోద్వేగం

హిందూ వివాహం అనేది పవిత్రమైన మతకర్మ అని పేర్కొంది. వివాహం అనేది పాటలు-డ్యాన్స్, భోజనం వంటి వాటి కోసం జరిగే కార్యక్రమం కాదని వ్యాఖ్యానించింది. హిందూ వివాహం భారత సమాజంలో గొప్ప విలువలను కలిగిన సంస్థగా ఉందని, అందువల్ల యువతీయువకులు వివాహ వ్యవస్థలోకి ప్రవేశించే ముందు దాని గురించి లోతుగా తెలుసుకోవాలని కోరుతున్నట్లు కోర్టు చెప్పింది. పెళ్లి అనేది పాటలు, డ్యాన్సులు, భోజనం లేదా ఒత్తిడి ద్వారా కట్నం, బహుమతుల్ని డిమాండ్ చేయడం కాదని సుప్రీంకోర్టు చెప్పింది. వివాహం అనేది లావాదేవీ కాదని, ఇది ఒక గంభీరమైన పునాది అని, భవిష్యత్తులో అభివృద్ధి చెందుతున్న కుటుంబానికి భార్యభర్తల హోదాను పొందే స్త్రీ, పురుషుల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తుందని, ఇది భారతీయ సమాజంలో ఒక లక్షణంగా పేర్కొంది.

హిందూ వివాహచట్టంలోని సెక్షన్ 8 ప్రకారం హిందూ వివాహ రిజిస్ట్రేషన్ వల్ల వివాహానికి రుజువు లభిస్తుందని, కానీ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం వివాహానికి చట్టబద్ధత లభించందని ధర్మాసనం పేర్కొంది. చట్టబద్ధత కోసం వివాహంలో జరిగే ఆచారాలు, వేడుకలు అవసమని చెప్పింది. సెక్షన్ 7 ప్రకారం వివాహం జరగకపోతే, రిజిస్ట్రేషన్ మాత్రమే వివాహానికి చట్టబద్ధత కల్పించదని చెప్పింది. పరస్పర గౌరవం మరియు భార్యాభర్తల మధ్య భాగస్వామ్యం ఆధారంగా హిందూ వివాహం యొక్క పవిత్ర లక్షణాన్ని కోర్టు నొక్కిచెప్పింది.

Exit mobile version