NTV Telugu Site icon

హిందీ, ఇంగ్లీష్‌ వస్తేనే గవర్నమెంట్ జాబ్..?

central government jobs

central government jobs

కొడితే.. సెంట్రల్‌ గవర్నమెంట్‌ జాబ్‌ కొట్టాలి.. లైఫ్‌ సెటిల్‌ ఐపోతుందని ప్రతీ నిరుద్యోగి కల. భాష కారణంగా కలను నిజం చేసుకోలేకపోతున్నారు నిరుద్యోగులు. పోటీ పరీక్షలన్నీ హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఉంటున్నాయి. తెలుగు, తమిల్‌, మళయాలం, కన్నడ వంటి ప్రాంతీయ భాషల్లోనే విద్యాభ్యాసం చేసిన అభ్యర్థులకు పరీక్షలను ఎదుర్కోలేకపోతున్నారు. ఇంగ్లీష్‌, హిందీ మాదిరిగానే… ప్రాంతీయ భాషల్లో కూడా పరీక్షలను నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌.. కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ను కోరారు. ఆంగ్లేతర మాధ్యమంలో చదివిన వారు, హిందీయేతర రాష్ట్రాల అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు కేటీఆర్‌.

జాతీయ పోటీ పరీక్షలు, కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలను 12 భారతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కానీ.. అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. యూరప్‌లాంటి దేశంలో కూడా రీజనల్‌ లాంగ్వేజెస్‌లో పరీక్షలు పెడుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదంటున్నారు కొందరు నిపుణులు. ఐఏఎస్‌, ఐపీఎస్‌తోపాటు సెంట్రల్‌ గవర్నమెంట్‌ పోటీ పరీక్షల్లో నార్త్‌ ఇండియన్సే ఉన్నతంగా రాణిస్తున్నారు. దానికి కారణం వారి ప్రాంతీయ భాష హిందీ అవడమేనని అంటున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రీజనల్‌ లాంగ్వేజెస్‌లో పరీక్షలు నిర్వహించేలా చూడాలని కోరుతున్నారు విద్యావేత్తలు. హిందీ, ఇంగ్లీష్‌లో ఉండటంతో అభ్యర్థులు పరీక్షలకు అప్లై చేయకుండానే మనవళ్ల కాదులే అని వదిలేస్తున్నారు.