Site icon NTV Telugu

Himachal Pradesh Flash Floods: మెరుపు వరదలు.. ఇప్పటి వరకు 19 మంది మృతి

Himachal Pradesh

Himachal Pradesh

Himachal Pradesh Flash Floods: హిమాచల్ ప్రదేశ్ మెరుపు వరదులు, వర్షాలతో అతలాకుతలం అవుతోంది. కుంభవృష్టిగా వానలు కురవడంతో మెరుపు వరదుల, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. గత 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ పరిస్థితి ఏర్పడింది. మెరుపు వరదలు, వర్షాలు, కొండచరియలు విరిగి పడటం మూలంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 19 మంది మరణించగా.. 9 మంది గాయపడ్డారు. మరో ఐదుగురు గల్లంతయ్యారని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది.

గోహర్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని కషన్ గ్రామంలో కొండచరియల వల్ల ఇళ్లు కూలిపోవడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మండి, కాంగ్రా, చంబా జిల్లాల్లో అత్యధిక నష్టం నమోదు అయింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 36 వరదలు, ప్రమాదాల వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. మండి వద్ద మనాలి-చండీగఢ్ జాతీయ రహదారి, సిమ్లా – చండీగఢ్ హైపే కొండచరియలు విరిగిపడటంతో బ్లాక్ చేశారు. ఒక్క మండి జిల్లాలోనే మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల 13 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. షోఘి, తారా దేవి మధ్య సోను బంగ్లా వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. పఠాన్ కోట్- హిమాచల్ ప్రదేశ్ ను కలిపే చక్కి రైల్వే బ్రిడ్జ్ వరదల ధాటికి కూలిపోయింది.

Read Also: Airport Name Change: పంజాబ్, హర్యానా ప్రభుత్వాల కీలక నిర్ణయం.. ఎయిర్ పోర్టు పేరు మార్పు

హిమాచల్ ప్రదేశ్ చంబా, బిలాస్ పూర్, సిర్మౌర్, మండి, కాంగ్రా జిల్లాల్లోని ఐసోలేటెడ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచానా వేసింది. టూరిస్టులు, ప్రజలు నదులు, వరద ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ నెల 25 వరకు కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని.. డిస్టాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రజలను హెచ్చరించింది.

Exit mobile version