Site icon NTV Telugu

Sukhvinder Sukhu: సీఎంను చుట్టుముట్టిన “కోడి కూర” వివాదం.. అసలేం జరిగింది? (వీడియో)

Sukhvinder Sukhu

Sukhvinder Sukhu

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు వివాదాలకు మరో వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘సర్కార్ గావ్ కే ద్వార్’ కింద సిమ్లా జిల్లా చౌపాల్ సబ్-డివిజన్‌లోని కుప్వి తహసీల్‌లోని టిక్కర్ గ్రామంలో ఆయన బస చేశారు. విందులో ముఖ్యమంత్రితో పాటు ఇతర అతిథులకు స్థానిక వంటకాలను వడ్డించారు. ఈ మోనూలో “వైల్డ్‌ చికెన్” కూడా ఉంది. సీఎం ఆ కూర తినలేదు. అయినప్పటికీ.. ఈ రకం కోడి కూరను మెనూలో చేర్చడాన్ని తప్పుపడుతూ జంతు సంరక్షణ సంస్థ ఓ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో సీఎం సుఖు వివాదాల్లోకి చేరారు.

READ MORE; Kakinada Crime: వివాహిత పట్ల అసభ్య ప్రవర్తన.. చంపేందుకు మహిళ బంధువులు ప్లాన్‌!

కాగా.. 1972 అటవీ సంరక్షణ చట్టం ప్రకారం రక్షిత జాతుల జాబితాలో ‘వైల్డ్‌ చికెన్‌’ కూడా చేర్చారు. వాటిని వేటాడటం నిషేధం. ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. ప్రతిపక్షాలు సీఎంను తప్పుపడుతున్నాయి. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం జైరాం ఠాకూర్ తన సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై, ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ.. “ఆనారోగ్య కారణాల వల్ల నేను నూనె, నాన్-వెజ్ వంటకాలకు దూరంగా ఉంటున్నాను. కానీ ప్రతిపక్ష నాయకులు ఈ వీడియో వైరల్‌ చేస్తూ.. గ్రామస్థుల పరువు తీసే విధంగా చేస్తున్నారు. గ్రామస్థుల ప్రతిష్టను దిగజార్చే పని చేస్తున్నారు. పర్వత ప్రాంతాల్లో నివసించే వారికి నాన్ వెజ్ ఫుడ్ వారి జీవితంలో భాగం. ఈ మాత్రం అర్థం చేసుకోకుంటే ఎలా.. వాస్తవానికి అక్కడున్న స్థానికులు నాకు ఆ ఆహారాన్ని అందించారు. కానీ నేను దానిని తినలేదు. అయితే కొన్ని మీడియా ఛానెళ్లు మాత్రం నేను ఆ చికెన్‌ తిన్నానంటూ ప్రసారం చేస్తున్నాయి.” అని తెలిపారు.

Exit mobile version