NTV Telugu Site icon

First Kiss: “తొలి ముద్దు”కు దూరమవుతున్న జపాన్ హైస్కూల్ స్టూడెంట్స్..

Japan

Japan

First Kiss: జపాన్‌లో ఎప్పుడూ లేనంతగా వింత ధోరణి కనిపిస్తోంది. జపాన్ హైస్కూల్ అబ్బాయిల్ తమ ‘‘ఫస్ట్ కిస్‌’’కి దూరమవుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. హైస్కూల్ బాయ్స్‌లో ప్రతీ ఐదుగురిలో ఒక్కరు మాత్రమే తొలి ముద్దు అనుభవాన్ని పొందుతున్నట్లు తేలింది. 1974 నుంచి ఇదే అత్యల్ప సంఖ్యగా తేలింది. జపాన్ అసోసియేషన్ ఫర్ సెక్స్ ఎడ్యుకేషన్ (JASE) 12,500 మంది విద్యార్థులపై జరిపిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2023లో అకడామిక్ ఇయర్‌లో నిర్వహించిన పోల్ ప్రకారం.. 22.8 శాతం మంది అబ్బాయిలు మాత్రమే తమ మొదటి ముద్దు అనుభవాన్ని పొందారని, అదే వయసులో ఉన్న 27.5 శాతం మంది అమ్మాయిలు తమ మొదటి ముద్దుని అనుభవించినట్లు సర్వే వెల్లడించింది.

Read Also: Andhra Pradesh: దేవాలయాల్లో అర్చకులకు కనీస వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం

2005లో తొలి ముద్దు పొందే స్కూల్ బాయ్స్ సంఖ్య గరిష్ట స్థాయికి చేరినప్పటికీ, ఇటీవల కాలంలో మళ్లీ క్షీణిస్తూ వస్తోంది. 1974 నుంచి అత్యల్ప స్థాయికి చేరింది. హైస్కూల్ అబ్బాయిలలో లైంగిక సంబంధం కలిగి ఉన్న వారి నిష్ఫత్రి కూడా 3.5 పాయింట్లకు తగ్గి 12 శాతానికి పడిపోయింది. హైస్కూల్ బాలికల్లో ఈ సంఖ్య 5.3 పాయింట్లకు తగ్గి 14.8 శాతానికి పడిపోయింది. ఈ ధోరణికి కోవిడ్ మహమ్మారి కూడా ఒక కారణమని సర్వే వెల్లడించింది. జపాన్ యువత ఇంట్లోనే ఉండి ఒంటరిగా లైంగిక విషయాలను చూడటానికి ఇష్టపడుతున్నారని, ఈ పరిణామం తక్కువ జననాల రేటును పెంచే ప్రమాదం ఉందని అక్కడి నిపుణులు భయపడుతున్నారు.

ప్రజలు లైంగికంగా చురుకుగా ఉండే సహజమైన సమయంలో కూడా, శారీరక లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉండే ధోరణిని ఇది చూపిస్తోందని సోషియాలజీ లెక్చరర్ తమకి కవాసకి పేర్కొన్నారు. ఇంట్లోనే ఉండి ఒంటరిగా లైంగిక కంటెంట్‌ని చూసే ధోరణి ఉంది. దేశ భవిష్యత్తుకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీనేజ్ యువకులు ఇలాగే కొనసాగితే, ఇప్పటికే తక్కువగా ఉన్న జననాల రేటులో ఎలాంటి మార్పు కనిపించడని చెప్పారు. ఇటీవల కాలంలో జపాన్‌లో జననాల రేటు రేటు తగ్గడంతో పాటు వృద్ధ జనాభా పెరిగింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశంలో జన్మించిన శిశువుల సంఖ్య 2023లో 8వ సంవత్సరం కూడా పడిపోయింది. 65 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు కలిగిన వారి సంఖ్య 2024లో 36.25 మిలియన్లకు చేరుకుంది. ఇది జపాన్ మొత్తం జనాభాలో 29.3 శాతంగా ఉంది.

Show comments