Site icon NTV Telugu

Kejriwal: కేజ్రీవాల్ బెయిల్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

Kejriwal

Kejriwal

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ సోమవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై మొదట విచారణ ట్రయల్ కోర్టులో జరగాలని సీబీఐ తెలిపింది. కేజ్రీవాల్ సహా ఆరుగురిపై చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు హైకోర్టుకు సీబీఐ తెలిపింది. కేసు దర్యాప్తును కేజ్రీవాల్ ప్రభావితం చేస్తున్నారని.. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అనేక ఆధారాలు వెలుగులోకి వచ్చాయని సమగ్ర దర్యాప్తు జరిపి చార్జ్‌షీట్ దాఖలు చేసిసట్లు న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది.

ఇది కూడా చదవండి: Dhanush ILAYARAJA: మోత మోగించడానికి రెడీ అవుతున్న ధనుష్ “ఇళయరాజా”

ఇదిలా ఉంటే లిక్కర్ పాలసీకి సంబంధించి సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని.. రికవరీ కూడా లేదని కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలిపారు. లిక్కర్ పాలసీ ఆమోదంపై కేజ్రీవాల్‌తో పాటు ఢిల్లీ ఎల్జీ సహా 15 మంది సంతకం చేశారరని.. వారిని ఎందుకు నిందితులుగా సీబీఐ చేర్చలేదని సింఘ్వి ప్రశ్నించారు. సీబీఐ కేసులో కేజ్రీవాల్ సూత్రధారి అంటున్నారని.. కానీ ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేవన్నారు. విజయ్ నాయర్‌కి సీబీఐ కేసులో బెయిల్ వచ్చిందని.. కేజ్రీవాల్‌కు కూడా బెయిల్ ఇవ్వాలని అభిషేక్ సింఘ్వి కోర్టును కోరారు.

ఇది కూడా చదవండి: France: ఫ్రాన్స్‌ ఒలింపిక్స్ క్రీడల సమయంలో కొనసాగుతున్న విధ్వంసకాండ..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం తీహార్ జైలుకు తరలించారు. ఆ మధ్య ట్రయల్ కోర్టులో రెగ్యులర్ బెయిల్ వచ్చింది. దీనిపై ఈడీ హైకోర్టుకు వెళ్లడంతో స్టే విధించింది. దీంతో బెయిల్ వచ్చినట్లే వచ్చి.. బ్రేక్ పడింది. మరోవైపు ఆయన ఆరోగ్యంపై ఆప్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇది కూడా చదవండి: Tamil Rockers Admin: ‘తమిళ్ రాకర్స్’ అడ్మిన్ అరెస్ట్

Exit mobile version