NTV Telugu Site icon

Kerala High Court: ‘‘ముస్లిం యువతి షేక్ ల్యాండ్‌’’.. ఆరోపణలు చేసిన వ్యక్తికి షాక్..

Kerala High Court

Kerala High Court

Kerala High Court: కేరళ మాజీ ఆర్థిక మంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చినందుకు, ఓ యువతి షరియా చట్టాన్ని ఉల్లంఘించిందని, ఆమె అసభ్యంగా ప్రవర్తించిందని ఆరోపణలు చేసిన వ్యక్తిపై కేసులు రద్దు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఏ మత విశ్వాసం కూడా రాజ్యాంగానికి అతీతం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

బహిరంగ కార్యక్రమంలో ముస్లిం యువతి మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్‌తో కరచాలనం చేసింది. దీనిని విమర్శిస్తూ కొట్టక్కల్‌కి చెందిన అబ్దుల్ నౌషాద్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిన్ పీవీ కున్హికృష్ణన్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంజ్ తీర్పు వెలువరించింది. ‘‘షేక్ హ్యాండ్’’ అనేది గ్రీటింగ్ , గౌరవం, మర్యాద, అగ్రిమెంట్, డీల్, ఫ్రెండ్ షిప్‌కి ప్రతీకగా ఉండే ఒక సంప్రదాయ సంజ్ఞ అని హైకోర్టు పేర్కొంది.

Read Also: Bangladesh: బంగ్లాదేశ్‌కి హమాస్, తాలిబాన్, అల్-ఖైదా నేతలు.. భారత్ అలర్ట్..

అబ్దుల్ నౌషాద్ ఒక వ్యక్తితో కరచాలనం చేయడం ద్వారా షరియత్ చట్టాన్ని ఉల్లంఘించిందనే వీడియోను వాట్సాప్ ద్వారా షేర్ చేశారని మహిళా ఫిర్యాదుదారు ఆరోపించారు. వీడియో ప్రకారం.. ఆమె ఒక మహిళ ఉంటూ మరొక వ్యక్తిని తాకినందున ఈ చర్యను వ్యభిచారంగా పరిగణించారని అతడు కోరాడు. మర్కజ్ లా కాలేజీలో సెకండ్ ఇయర్ లా స్టూడెంట్ అయిన యువతి, మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్‌తో సంభాషిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. విద్యార్థులు ప్రశ్నించ తర్వాత వారికి బహుమతులు అందించబడ్డాయి, ఆ సమయంలో యువతి మాజీ ఆర్థిక మంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చారు.

ఈ చర్య షరియత్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించిన వ్యక్తిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153 మరియు కేరళ పోలీసు చట్టం, 2011లోని సెక్షన్ 119(ఎ) కింద పోలీసు అభియోగాలు మోపారు. ఈ వీడియో తన కుటుంబాన్ని అగౌరపరించిందని యువతి కోర్టులో పేర్కొంది. ఒక ముస్లిం యువతి ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చిందని, వీడియో ఆమె మత విశ్వాస స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని కోర్టు పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో మన రాజ్యాంగం ఆమెకు అండగా ఉంటుందని, అంతే కాకుండా సమాజం ఆమెకు అండగా నిలవాలని జస్టిస్ కున్హి కృష్ణన్ అన్నారు.

‘‘రాజ్యాంగానికి మించిన మత విశ్వాసం లేదు. రాజ్యాంగమే అత్యున్నతమైనంది’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి మత విశ్వాసాలకు కట్టుబడి ఉండాలని మరొక వ్యక్తి బలవంతం చేయలేదరని, మతపరమైన ఆచారం ప్రతీ పౌరుడి వ్యక్తిగత విషయనే విషయాన్ని ఈ తీర్పు బలపరిచింది. ఈ కేసులో మహిళ తనదైన రీతిలో మతపరమైన ఆచారాలను అనుసరించే హక్కు ఉందని, ఎవర తమ నమ్మకాలను ఇతరులపై రద్దకూడదని హైకోర్టు నొక్కి చెప్పింది.