Allahabad HC: పీజీ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బాధితురాలి తీరును తప్పుపడుతూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలు ‘‘తానే ఇబ్బందుల్ని ఆహ్వానించింది’’, ‘‘ ఈ సంఘటనకు ఆమె బాధ్యత వహిస్తుంది’’అని పేర్కొంది. ఢిల్లీలో మహిళపై అత్యాచారం చేశారనే ఆరోపణలతో డిసెంబర్ 2024లో అరెస్ట్ అయిన నిందితుడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో ‘‘బాధితురాలి ఆరోపణ నిజమని అంగీకరించినప్పటికీ, ఆమె స్వయంగా ఇబ్బందులను ఆహ్వానించిందని, దానికి బాధ్యత వహించాలి’’ అని జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ అన్నారు. మహిళ పీజీ చదువుతుందని, కాబట్టి ఆమెకు ఆమె చేసే పనుల పట్ల పరిణితి ఉందని హైకోర్టు పేర్కొంది.
Read Also: Tahawwur Rana: భారత్‌కి తహవూర్ రాణా అప్పగింతపై పాకిస్తాన్ ఏం చెబుతోంది..?
ఈ కేసు సెప్టెంబర్ 2024 నాటిది, నోయిడాకు చెందిన ఒక యూనివర్సిటీ విద్యార్థిని ఢిల్లీలోని హౌజ్ ఖాన్‌లోని ఒక బార్‌కి తన ముగ్గురు మహిళా స్నేహితులతో వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు నిందితుడితో సహా మరికొందరు పరిచయస్తులను కలిసింది. తెల్లవారు 3 గంటల వరకు మద్యంసేవించిన తర్వాత, నిందితుడు తన ఇంటికి ఆమెను తీసుకెళ్లాడు. ఆమె కూడా అందుకు అంగీకరించింది. అయితే, నిందితుడు ప్రయాణంతో తనను అనుచితంగా తాకాడని, అతడి ఇంటికి కాకుండా గుర్గావ్‌లోని అతడి బంధువుల ఇంటికి తీసుకెళ్లి, అక్కడ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది.
మహిళ ఫిర్యాదు ఆధారంగా డిసెంబర్ 2024లో నిందితడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, నిందితుడు తన బెయిల్ పిటిషన్‌లో మహిళ తనకు సాయం అవసరం అని, విశ్రాంతి తీసుకోవడానికి తన ఇష్టపూర్వకంగానే తనతో వచ్చిందని వాదించాడు. అత్యాచారం చేయలేదని, ఈ సంఘటన పరస్పర అంగీకారంతో కూడిన లైంగిక సంబంధం అని అతను ఆరోపించాడు.