మాదక ద్రవ్యాలను రవాణా చేసేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త పంథాలను వెతుకుతున్నారు. స్మగ్లర్లు ఎన్ని ప్లాన్లు చేసిన కస్టమ్స్ అధికారులు తిప్పికొడుతున్నారు. అలాంటి ఘటనే ఇది .. ఉగాండా దేశానికి చెందిన జూడిత్ అనే వ్యక్తి భారీగా హెరాయిన్ తరలించేందుకు ప్లాన్ చేసాడు. కస్టమ్స్ అధికారులను ఏమార్చి మాదక ద్రవ్యాలను తరలించేందుకు పథకం పన్నాడు. దాని కోసం కేటుగాడు 7 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్ ను 108 క్యాప్ సెల్స్ లో నింపి లోదుస్తులల్లో దాచి తరలించేందుకు యత్నించాడు.
ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి షార్జా నుండి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్నాడు. అయితే జూడిత్ పై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు.. అతడితో పాటు తనతో పాటు తెచ్చిన లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో భారీగా హెరాయిన్ బయటపడింది. దీంతి జుడిత్ ను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేసి, హెరాయిన్ ను సీజ్ చేశారు. అంతేకాకుండా జూడిత్ పై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
