NTV Telugu Site icon

Hemant Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణం

Cm

Cm

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడోసారి హేమంత్ సోరెస్ ప్రమాణస్వీకారం చేశారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్.. హేమంత్‌చే ప్రమాణం చేయించారు. ఐదు నెలల జైలు జీవితం తర్వాత జూలై 4న మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. జనవరి 31న మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు హేమంత్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఆయన వారసుడిగా చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇటీవలే హేమంత్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఇక బుధవారం అనూహ్యంగా చంపై ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి హేమంత్ సీఎంగా ప్రమాణం చేశారు. ఇక మంత్రివర్గంలో కూడా మార్పులు ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేబినెట్‌లో సతీమణి కల్పనా సోరెన్‌కు చోటు దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.