Site icon NTV Telugu

Hemant Soren: ప్రధాని మోడీతో హేమంత్ సోరెన్ దంపతుల భేటీ.. సీఎం ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానం..

Hemanth Soren

Hemanth Soren

Hemant Soren: న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని హేమంత్‌ సోరెన్‌ అతని సతీమణి, గండే నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కల్పనా సోరెన్ కలిశారు. ఈ సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. నవంబర్ 28వ తేదీన రాంచీలోని మోర్హబడి గ్రౌండ్ లో రాష్ట్ర నూతన సీఎంగా సోరెన్‌ ప్రమాణం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది.

Read Also: Pushpa 2: దేవిశ్రీకి షాక్.. ‘గంగమ్మ జాతర’ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?

కాగా, తాజాగా జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి గ్రాంఢ్ విక్టరీ సాధించింది. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) మొత్తం 56 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించారు. జేఎంఎం ఒక్కటే 34 అసెంబ్లీ స్థానాల్లో గెలవగా.. కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ(ఎంఎల్) రెండు స్థానాలను దక్కించుకుంది. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.

Exit mobile version