NTV Telugu Site icon

Hemang Joshi : చిన్న వయసులోనే బీజేపీ ఎంపీ టికెట్ ఆయన ఎవరంటే..

Joshi

Joshi

Hemang Joshi : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని సొంత రాష్ట్ర మైన గుజరాత్ లో బీజీపీ మరో యువ నాయకుడికి సీటు ఖరారు చేసింది. గుజరాత్‌లోని వడోదర టికెట్ ను 33 ఏళ్ల వయసున్న హేమాంగ్ జోషికి కేటాయించింది. జోషీ హోలీ సందర్భంగా ఓ సంగీత కార్యక్రమానికి హాజరవుతుండగా..ప్రముఖులు ఫోన్ చేసి అభినందనలు తెలపడంతో వడోదర స్థానానికి బీజేపీ తనను అభ్యర్థిగా ఎంపిక చేసిందని అతడికి తెలిసింది. అసలు ఏమైందంటే..

గుజరాత్‌ రాష్ట్రంలోని వడోదర స్థానానికి బీజేపీ సిట్టింగ్ ఎంపీగా రంజన్ భట్ ఉన్నారు. రెండుసార్లు ఈ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికైన ఆమెకు ప్రస్తుత ఎన్నికల్లో కూడా అదే సీటు కేటాయించారు. కాని రంజన్ భట్ వ్యక్తి గత కారణాలతో ఉన్నపలంగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఆలోచనలో పడ్డ పార్టీ అగ్రనాయకులు మాజీ విద్యార్థి నాయకుడు, 33 ఏళ్ల యువకుడైన జోషికి టికెట్ కేటాయించారు. రాష్ట్రంలో 26 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థల్లో పిన్న వయస్కుడు జోషీనే.

సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం మరియు పారిశ్రామిక అభివృద్ధికి పేరుగాంచిన పూర్వపు రాచరిక ప్రాంతమైన వడోదర నుండి 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ పోటీ చేశారు. యూపీలోని వారణాసి నుంచి కూడా పోటీ చేసిన ఆయన రెండుచోట్ల విజయం సాధించడంతో వడోదర స్థానాన్ని రంజన్‌ భట్‌కు కేటాయించారు.

ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, యువ బీజేపీ నాయకుడు మాట్లాడుతూ.. 10 లక్షల ఓట్ల తేడాతో గెలవాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తనకు టిక్కెట్ వస్తుందని కలలో కూడా ఊహించలేదని, చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలోని యువ ఓటర్ల మద్దతుతో తాను పనిచేస్తున్నానని చెప్పారు. విద్యార్థి నాయకుడు జోషి 10 లక్షల ఓట్ల తేడాతో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. మీడియా ప్లాట్‌ఫాం ఫాక్స్ స్టోరీ ఇండియా రూపొందించిన 40 ఏళ్లలోపు భారతదేశపు 40 మంది యువ నాయకుల జాబితాలో జోషికి స్థానం దక్కింది.

దరలో కొనసాగుతున్న అశాంతి కారణంగా పార్టీ ఆమెను స్వచ్ఛందంగా వెనక్కి తీసుకోవాలని ఆదేశించిందా అని అడిగిన ప్రశ్నకు, “పార్టీ నాకు మూడవసారి టికెట్ ఇచ్చింది; వారు నాకు పోటీ చేసే అవకాశాన్ని నిరాకరించలేదు కాబట్టి వారు నన్ను ఎందుకు ఉపసంహరించుకోవాలని అడుగుతారు?