Site icon NTV Telugu

Droupadi Murmu: కేరళ పర్యటనలో రాష్ట్రపతికి తప్పిన ప్రమాదం

Droupadi Murmu

Droupadi Murmu

కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా హెలిప్యాడ్ ఉన్న స్థలం ఒక్కసారిగా కుంగిపోయింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై హెలికాప్టర్ కిందకు దిగిపోకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Mamdani-Modi: భారత్‌లో కొంతమందికే చోటుంది.. దీపావళి వేడుకలో మోడీ లక్ష్యంగా న్యూయార్క్ మేయర్ అభ్యర్థి విమర్శలు

నాలుగు రోజుల కేరళ పర్యటన కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం తిరువనంతపురం వచ్చారు. రాత్రి రాజ్‌భవన్‌లో బస చేసిన ఆమె ఈ ఉదయం శబరిమల ఆలయ దర్శనానికి బయల్దేరారు. బుధవారం ఉదయం పథనంథిట్టకు వచ్చారు. రాజీవ్‌ గాంధీ ఇండోర్‌ స్టేడియంలో హెలికాప్టర్‌ దిగుతుండగా.. హెలిప్యాడ్‌ ఒక్కసారిగా కుంగిపోయింది. హెలికాప్టర్‌ చక్రం అందులో ఇరుక్కుపోయింది. భద్రతా సిబ్బంది పైకి లేపేందుకు ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది రాష్ట్రపతిని సురక్షితంగా హెలికాప్టర్‌ నుంచి కిందకు దించారు. అనంతరం రోడ్డు మార్గంలో పంబకు వెళ్లిపోయారు. ఇక హెలికాప్టర్‌ చక్రాన్ని బయటకు తీసేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు టీవీ ఛానళ్లలో.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాస్తవానికి రాష్ట్రపతి హెలికాప్టర్‌ పంబ సమీపంలోని నీలక్కల్‌ దగ్గర దిగాల్సింది. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్‌ను మార్చారు.

ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు

నాలుగు రోజుల పాటు కేరళలో రాష్ట్రపతి పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా శబరిమల అయ్యప్ప ఆలయం, శివగిరి సందర్శన, రాజ్‌భవన్‌లో మాజీ రాష్ట్రపతి కే.ఆర్.నారాయణన్ విగ్రహా ఆవిష్కరణ, రెండు కళాశాల్లో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు.

 

Exit mobile version