NTV Telugu Site icon

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో కీలక విషయాలు..

Saif Ali Khan

Saif Ali Khan

Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం అనే అక్రమ బంగ్లాదేశీ వ్యక్తి అతడిపై దాడికి పాల్పడ్డాడు. కత్తితో సైఫ్‌పై దాడి చేయడంతో, 6 చోట్ల గాయాలయ్యాయి. వెన్నెముకలో కత్తి విరిగిపోయింది. ఈ ఘటన తర్వాత సైఫ్‌ని లీలావతి ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యలు శస్త్రచికిత్స చేసి వెన్నెముకలో విరిగిన కత్తిని బయటకు తీశారు. ఈ రోజు(మంగళవారం) సైఫ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారు.

Read Also: Thaman: నాకు క్రికెట్లో, షోస్ లో వచ్చే డబ్బు అంతా చారిటీకే, సినిమాలో వచ్చే డబ్బు మాత్రమే నాకు!

అయితే, సైఫ్‌పై దాడి విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని సైఫ్ అలీ ఖాన్ గట్టిగా పట్టుకోవడంతో, విడిపించుకునే ప్రయత్నంలో అతడి వెన్నులో కత్తితో పొడిచినట్లు తెలిసింది. ఈ దాడిలోని వెన్నెముక లో 2.5 అంగుళాల కత్తి ముక్క విరిగిపోయింది. ఇది మరో 2 మి.మీ లోతుగా గుచ్చుకుంటే తీవ్ర గాయమయ్యేదని వైద్యులు చెప్పారు. ఇంట్లోకి వచ్చిన నిందితుడు బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో నిందితుడిని ముందు నుంచి సైఫ్ గట్టిగా పట్టుకున్నాడు. ఈ సమయంలో తన చేతిలో ఉన్న కత్తితో సైఫ్ వీపులో పొడిచాడు.

నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ఇంట్లోని ఇంకా ఉన్నాడని భావించిన సైఫ్ వెంటనే మెయిన్ డోర్ లాక్ చేశాడు. అయితే, నిందితుడు వచ్చిన బాత్రూం కిటికీ నుంచే పారిపోయాడు. నిందితుడు ఆ భవనంలోని గార్డెన్‌లో దాదాపు 2 గంటల పాటు దక్కున్నాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. నిందితుడు బాత్రూం కిటికీ, డాక్ట్ షాఫ్ట్ నుంచి ప్రవేశించడానికి ఉపయోగించే నిచ్చెన ద్వారా ఫ్లాట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు గతంలో తెలిపారు.