NTV Telugu Site icon

కర్ణాటక లాక్ డౌన్ ఎఫెక్ట్:  బోర్డర్ లో నిలిచిపోయిన వాహనాలు 

క‌ర్ణాట‌క‌లో ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కోన‌సాగుతోంది.  ఈరోజు నుంచి మే 24 వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.  దీంతో తెలంగాణ రాష్ట్ర స‌రిహ‌ద్దు ప్రాంతంలోని దేవ‌సుగుర్ చెక్‌పోస్ట్ ద‌గ్గ‌ర క‌ర్ణాట‌క పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.  వైద్యం,నిత్య‌వ‌స‌ర స‌రుకుల వాహ‌నాల‌ను మాత్ర‌మే క‌ర్ణాట‌క‌లోకి అనుమ‌తిస్తున్నారు.  దీంతో ఆ ప్రాంతంలో వాహ‌నాలు భారీగా నిలిచిపోయాయి.  క‌ర్ణాటక‌లో రోజువారి క‌రోనా కేసులు 40 వేల‌కు పైగా న‌మోదవుతుండ‌టంతో రెండు వారాల‌పాటు సంపూర్ణ‌లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నారు.  లాక్ డౌన్ అమలు చేయ‌కుంటే రాబోయె రోజుల్లో ఒక్క బెంగళూరు న‌గ‌రంలోనే అత్య‌ధిక కేసులు న‌మోద‌వుతాయ‌ని నిపుణులు హెచ్చ‌రించ‌డంతో స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకుంది.