NTV Telugu Site icon

Heavy Rains: తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Rain

Rain

Heavy Rains: దేశవ్యాప్తంగా అక్టోబర్ 12 నుంచి 16వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొనింది. ఈ క్రమంలో ఈరోజు తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకొచ్చింది. ఇక, ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. తమిళనాడు డెల్టా ప్రాంతంలో 8 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, చెన్నై, పుదుచ్చేరి సహా ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ఆదేశాలు ఇచ్చింది.

Read Also: Covid Scam: కర్ణాటకలో కోవిడ్ స్కాం.. సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..!

అలాగే, పుదుచ్చేరిలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కాగా, ప్రభుత్వాస్పత్రి జలదిగ్బంధం చిక్కుకుపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పేషెంట్లను మరో ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. భారీగా కురుస్తున్న వర్షాలతో వరదలు సంబవిస్తుండటంతో.. చెన్నై, పుదుచ్చేరి మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే, తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో వరద నీరు సబ్‌వేలోకి చేరింది. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో అలర్టైన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు.