గత కొన్ని రోజులుగా ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పాతకాలం నాటి ఇళ్లు కూలిపోతున్నాయి. అటు కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ముంబైలో ఇప్పటి వరకు 23 మంది మరణించినట్టు అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజుల పాటు ముంబై నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలో ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. దీంతో మహాసర్కార్ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ముంబైని ముంచెత్తిన వరద: 23 మంది మృతి…
