Site icon NTV Telugu

Heavy rain alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!

Heavyrain

Heavyrain

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగస్టు మొదటి వారంలో పశ్చిమ తీరం వెంబడి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇక బుధవారం మిజోరంలో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Goa: గోవాలో మద్యాన్ని నిషేధించాలి.. ఎమ్మెల్యే డిమాండ్..

రాబోయే ఐదు రోజుల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, విదర్భలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఆగస్టు మొదటి వారంలో ఈ ప్రభావం ఉంటుందని తెలిపింది. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, కోస్తాంధ్ర, కర్ణాటకలో కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారులు కూడా తగు చర్యలు తీసుకోవాలని తెలిపింది.

ఇది కూడా చదవండి: Minister TG Bharath: ఏపీకి చంద్రబాబే పెద్ద బ్రాండ్..100 రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానం

ఇదిలా ఉంటే మంగళవారం కేరళలో ప్రకృతి విలయానికి దాదాపు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలు పాలయ్యారు. మరికొందరు గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: Paris Olympics 2024: ఆర్చర్‌ విభాగంలో ప్రీక్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన దీపికా కుమారి..

Exit mobile version