NTV Telugu Site icon

Chennai: చెన్నై సిటీలో కుండపోత వర్షం.. సెల్ ఫోన్ సిగ్నల్స్ కు అంతరాయం..

Chennai

Chennai

Chennai: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. మరో 24 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చెన్నై నగరంలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి టీ నగర్, వెలచేరి, పురుషవాకం, అన్నా నగర్, కోయంబేడు సహా ఇతర లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో అలర్ట్ అయిన తమిళనాడు ప్రభుత్వం.. చెన్నై సిటీలోని సబ్ వేలను మూసి వేసింది. దీంతో పాటు మెట్రో ట్రైన్ సేవలు తాత్కాలికంగా రద్దు చేసింది.

Read Also: CSIR UGC NET Result 2024: NET జూన్ పరీక్ష ఫలితాల విడుదల.. ఫలితాలు చెక్ చేసుకున్నారా?

ఇక, పలు చోట్లా రోడ్లపైకి మెడ లోతు వరకు వరద నీరు చేరింది. కుండపోత వర్షం ధాటికి సెల్ ఫోన్ సిగ్నల్స్ కు అంతరాయం కలిగింది. ఇక, సిగ్నల్ ఇష్యూ రాకుండా ఎయిర్‌టెల్, జియో, బీఎస్‌ఎన్‌ఎల్, వొడాఫోన్ తో పాటు ఇతర సంస్థల ప్రతినిధులతో అధికారుల అత్యవసర సమావేశం అయ్యారు. అలాగే, కమాండ్ కంట్రోల్ రూమ్ లో నుంచి భారీ వర్షాలను రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పర్యవేక్షిస్తున్నారు.