Site icon NTV Telugu

IMD Warning: పలు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!

Heavyrain

Heavyrain

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల జాబితాను ప్రకటించింది. ఇందులో రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Manipur: మణిపూర్‌లో కీలక పరిణామం.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు

అస్సాం, మేఘాలయ, కర్ణాటక, కేరళ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, గోవా, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో గురువారం, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Putin: ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ షరతులు…!

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 3 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని.. గంటకు 70 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. బుధ, గురు, శుక్రవారాల్లో వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని తెలిపింది. ఇక గురువారం అత్యంత తీవ్రమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు ఇంట్లోనే ఉండాలని.. బహిరంగ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించింది.

Exit mobile version