NTV Telugu Site icon

IMD Rain Alert: దక్షిణాది రాష్ట్రాలకు అత్యంత భారీ వర్షసూచన

Imdrain

Imdrain

దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్షసూచన చేసింది. రాబోయే రోజుల్లో కేరళ, లక్షద్వీప్, తమిళనాడు, కర్ణాటక, ఏపీలోని రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Monkeypox: మంకీపాక్స్ వైరస్ కారణంగా ఆ దేశంలో 548 మంది మృతి..

పశ్చిమ బెంగాల్‌ మీదగా అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉన్నందున రాబోయే మూడు, నాలుగు రోజుల్లో తూర్పు మరియు మధ్య భారతదేశంలో వర్షాలు అత్యధికంగా వర్షాలు కురిసే ఛాన్సు ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. రహదారులు జలమయం అయ్యాయి. రాబోయే రెండు రోజులు తెలంగాణలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఇది కూడా చదవండి: AP Rain Alert: ఏపీలో రెండు రోజుల పాటూ భారీ వర్షాలు.. పిడుగులు పడే ఛాన్స్..!