దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు రాష్ట్రాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Ranya Rao: రంగంలోకి సీబీఐ.. రన్యారావు పెళ్లికి ఖరీదైన గిఫ్ట్‌లు.. వీడియో పరిశీలిస్తున్న అధికారులు
గురువారం అస్సాం, మేఘాలయలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇక శుక్రవారం, శనివారం జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. గురువారం, శుక్రవారం, శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
ఇది కూడా చదవండి: NKR 21 : అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్