Site icon NTV Telugu

Heartbreaking Scene: హృదయవిధారక ఘటన.. ఉగ్రదాడిలో చనిపోయిన తండ్రి.. పప్పా లే అంటున్న చిన్నారి

Untitled Design (1)

Untitled Design (1)

ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు జవాన్ కోల్పోయాడు. అయితే అతడికి ఏడాది వయసున్న చిన్నారి ‘పప్పా.. పప్పా’ అంటూ విలపించిన దృశ్యం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. నిండు జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన ఆ చిన్నారి, తండ్రి లేని లోకంలో తెలియని వేదనతో మునిగిపోయింది.ఈ విషాద ఘటన మానవత్వాన్ని కదిలిస్తూ, శాంతి విలువను మరోసారి గుర్తుచేస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో SOG జవాన్ అమ్జద్ ఖాన్ వీరమరణం పొందారు. ఆయన పార్థివదేహం స్వగ్రామానికి చేరుకున్న సమయంలో అక్కడ నెలకొన్న దృశ్యాలు హృదయాలను కదిలించాయి. అచేతనంగా పడి ఉన్న తండ్రిని చూసిన ఏడాది వయసున్న చిన్నారి, ఆయన ఇక లేరన్న నిజాన్ని గ్రహించలేక ‘పప్పా.. పప్పా’ అంటూ పిలవడం అక్కడున్నవారందరినీ కన్నీళ్లలో ముంచెత్తింది. తండ్రి ఒడిలో ఆడుకోవాల్సిన వయసులోనే అతడిని కోల్పోవడం ఆ దృశ్యాన్ని మరింత విషాదంగా మార్చింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు భావోద్వేగంతో స్పందిస్తున్నారు. ‘దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడికి సెల్యూట్’, ‘ఇలాంటి త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోదు’ అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేస్తున్నారు. అమ్జద్ ఖాన్ దేశ భద్రత కోసం చేసిన త్యాగం యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని, ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు.

Exit mobile version