Site icon NTV Telugu

Uttar Pradesh:ప్రసవ వేదనతో భార్య మృతి.. కొన్ని గంటల్లోనే కుప్పకూలిన భర్త

Untitled Design (17)

Untitled Design (17)

ఉత్తరప్రదేశ్‌లో హృదయ విధారకర సంఘటన చోటుచేసుకుంది. గంటల వ్యవధిలో భార్య భర్తలిద్దరూ మరణించడంతో.. ఆ ప్రాంతమంతా.. శోక సంద్రంలో మునిగిపోయింది.

Read Also:Misbehave: దేశ అధ్యక్షురాలిపై చేయి వేసి.. ముద్దు పెట్టబోయిన ఓ వ్యక్తి.. అడ్డుకున్న సిబ్బంది

పూర్తి వివారల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లా నిఖై నివాసి అయిన ఆకాష్ గత సంవత్సరం జ్యోతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే.. జ్యోతి గర్భవతి.. మంగళవారం జ్యోకి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె కుటుంబ సభ్యులు వెంటనే.. ఆమెను గౌరీగంజ్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు, కానీ వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో.. రాయ్‌బరేలిలోని ఎయిమ్స్‌కు రిఫర్ చేశారు. అప్పటికి జ్యోతి పరిస్థితి విషమించి .. మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Read Also:ఉద్యోగాల పేరుతో.. యువతులను గలీజ్ దందాలోకి దింపుతున్న ముఠా అరెస్ట్

జ్యోతి మరణ వార్త కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. భర్త ఆకాష్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆకాష్ కంటిన్యూగా ఏడుస్తూ.. జ్యోతి లేకుండా నేను జీవించలేను అని భోరుమని విలపించాడు. కొన్ని గంటల్లోనే అతని ఆరోగ్యం క్షీణించింది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించారు. కానీ ఆకాష్ తన ఇంట్లోనే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. కొన్ని గంటల వ్యవధిలోనే భార్యాభర్తల మరణ వార్తతో చుట్టుపక్కల వారందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె కుటుంబ సభ్యులు ఆమెను గౌరీగంజ్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు, కానీ వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని ప్రకటించి, రాయ్‌బరేలిలోని ఎయిమ్స్‌కు రిఫర్ చేశారు. జ్యోతి ఆరోగ్యం మరింత విషమంగా మారింది. దీంతో ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. తన కొడుకు గత సంవత్సరమే వివాహం చేసుకున్నాడని ఆకాష్ తండ్రి సత్య ప్రకాష్ అన్నారు.

Exit mobile version