Site icon NTV Telugu

Indian Coast Guard: నడి సముద్రంలో హర్ట్ స్ట్రోక్‌.. రెస్క్యూ ఆపరేషన్‌తో రోగికి చికిత్స

Indian Coast Guard

Indian Coast Guard

Indian Coast Guard: ఓడలో ప్రయాణిస్తున్న వ్యక్తికి నడి సముద్రంలో హర్ట్ స్ట్రోక్‌ వచ్చింది. పరిస్థితి తీవ్రంగా ఉంది. ఎలా కాపాడాలా? కోస్డ్ గార్డ్స్ కి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్స్ రెస్క్యూ ఆపరేషన్‌ చేసి.. అతన్ని హెలికాప్టర్‌లోకి తీసుకుని ప్రథమ చికిత్సను అందించి.. అనంతరం ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సను చేసి ప్రాణాలు కాపాడారు. అరేబియా సముద్రంలో చైనీయుడికి తీవ్ర గుండెనొప్పి వచ్చింది. సమాచారమందుకున్న భారత కోస్ట్‌ గార్డ్‌ సాహసోపేతమైన ఆపరేషన్‌ చేపట్టి అతడిని రక్షించింది.

Read also: Swathistha: రజినీ కోడలు కత్తి అనుకుంటే… కమల్ కోడలు అమ్మోరు కత్తిలా ఉందే…

పనామా పతాకంతో ఉన్న ఎంవీ డాంగ్‌ ఫాంగ్‌ కాన్‌ టాన్‌ నంబర్‌ 2 రీసర్చ్‌ నౌక చైనా నుంచి అరేబియా సముద్రం మీదుగా యూఈఏ వెళుతుంది. బుధవారం రాత్రి ఈ నౌకలో పనిచేస్తున్న సిబ్బంది యిన్‌ వీగ్‌యాంగ్‌ కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడు. తీవ్రమైన ఛాతినొప్పితో విలవిల్లాడిపోయాడు. సమస్య తీవ్రతను గమనించిన నౌక సిబ్బంది సమీప తీర ప్రాంతమైన ముంబయిలోని మారిటైమ్‌ రెస్క్యూ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు అత్యవసర సందేశం పంపించారు. దాంతో అప్రమత్తమైన భారత కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది బాధితుడిని అత్యవసరంగా ఆసుపత్రికి చేర్చేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది. ఏఎల్‌హెచ్‌ ఎంకే-3 హెలికాప్టర్‌తో కోస్ట్‌గార్డ్‌ బయల్దేరారు. వారు వచ్చిన అర్థరాత్రి సమయంలో చైనా నౌక అరేబియా సముద్రంలో తీరానికి దాదాపు 200 కి.మీల దూరంలో ఉంది. వాతావరణ పరిస్థితులు కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. అయినప్పటికీ కోస్ట్‌గార్డ్‌ చిమ్మచీకట్లో ధైర్యంగా నౌకలో నుంచి వీగ్‌యాంగ్‌ను ఎయిర్‌లిఫ్ట్‌ చేసి హెలికాప్టర్‌లోకి తీసుకుంది. ఎయిర్‌లిఫ్ట్ లోకి తీసుకోగానే వెంటనే ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స అనంతరం సమీప ఆసుపత్రికి తరలించినట్లు భారత రక్షణ శాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురైన సందర్భంలో కూడా కోస్ట్ గార్డ్‌ రెస్క్యూ ఆపరేషన్‌ చేసి సిబ్బంది ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు మరోసారి అటువంటి ఆపరేషన్‌ చేసి చైనా వ్యక్తి ప్రాణాలు కాపాడారు.

Exit mobile version