
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జ్వరం, జలుబు వంటి లక్షలు ప్రాధమికంగా కరోనా లక్షణాలుగా ఉండేవి. అయితే, జ్వరం, జలుబు ఉన్న వ్యక్తులందరికి కరోనా వస్తుందని అని గ్యారెంటీ లేదు. ఈ ప్రాధమిక లక్షణాలతో పాటుగా ఇప్పుడు మరికొన్ని లక్షణాలు కూడా వచ్చి చేరాయి. జ్వరంతో పాటుగా ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. అంతేకాదు, తలనొప్పి, నీరసం వంటి వాటితో బాధపడే వ్యక్తులకు టెస్టులు చేసినపుడు కరోనా పాజిటివ్ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే గాలి నుంచి కూడా కరోనా శరీరంలోకి ప్రవేశిస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కళ్ళ నుంచి కూడా కరోనా శరీరంలోకి ప్రవేస్తుందని తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. కరోనా వైరస్ కళ్ళను చేరినపుడు కళ్ళు ఎర్రగా మారతాయి. కాబట్టి కరోనా నుంచి రక్షణ కోసం కళ్ళజోడు తప్పనిసరిగా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.