NTV Telugu Site icon

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర ప్రధాన పూజారికి ‘‘బ్రెయిన్ స్ట్రోక్’’.. పరిస్థితి విషమం..

Mahant Satyendra Das

Mahant Satyendra Das

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రధాన పూజారి 85 ఏళ్ల మహంత్ సత్యేంద్ర దాస్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఆదివారం ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్‌కి గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGI)లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు సోమవారం తెలిపాయి. “శ్రీ సత్యేంద్ర దాస్ గారు స్ట్రోక్ తో బాధపడుతున్నారు. ఆయనకు డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఉంది. ఆయనను ఆదివారం SGPGI లో చేర్చారు. ప్రస్తుతం న్యూరాలజీ వార్డ్ HDU (హై డిపెండెన్సీ యూనిట్) లో ఉన్నారు” అని సోమవారం ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also: Coconut Water: కొబ్బరి నీళ్లు తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని మీకు తెలుసా..?

ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, వైద్యానికి సహకరిస్తున్నారని, అతడి కీలక శరీర ప్రమాణాలు స్థిరంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదు కూల్చివేసినప్పుడు దాస్ తాత్కాలిక రామాలయ పూజారిగా ఉన్నారు. రామమందిరానికి ప్రధాన పూజారిగా ఎక్కువ కాలంగా పనిచేసిన దాస్, 20 ఏళ్ల వయసులోనే ఆధ్యాత్మికాన్ని ఎంచుకున్నారు. నిర్వాణి అఖాడాకు చెందిన ఆయన, అయోధ్యలో అందుబాటులో ఉండే సాదువుల్లో ఒకరు.