Site icon NTV Telugu

IIT Bombay: తాను చదువుకున్న ఐఐటీకీ రూ. 315 కోట్ల విరాళం

Iit Bombay

Iit Bombay

IIT Bombay: తాను చదువుకున్న విద్యాసంస్థకు భారీ విరాళాన్ని ప్రకటించారు పూర్వ విద్యార్థి. విరాళం అంటే లక్షనో.. రెండు లక్షలో కాదు..ఏకంగా రూ. 315 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఆ పూర్వ విద్యార్థే ఎవరో కాదు.. దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ అయిన నందన్‌ నిలేకని.. విరాళం ఇచ్చింది తాను ఇంజనీరింగ్‌ విద్యను పూర్తి చేసుకున్న ఐఐటీ బాంబేకు ఈ భారీ విరాళం ప్రకటించారు. గతంలోనూ తాను ఐఐటీ బాంబేకు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.

Read also: Electricity Bill: కరెంట్ బిల్ ఎక్కువగా వస్తోందని ఆందోళన చెందుతున్నారా?.. ఈ లైట్‌ ఇంట్లో ఉంటే చాలు!

ఇన్‌స్టిట్యూట్‌తో తాను 50 ఏళ్ల అనుబంధం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భారీ విరాళం ప్రకటించినట్టు ఆయన తెలిపారు. నందన్‌ నిలేకని 1973లో బాంబే ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీలో చేరారు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాను ఈ విరాళం ప్రకటించినట్టు తెలిపారు. బాంబే ఐఐటీ నా జీవితానికి మూలస్తంభంగా ఉంది. నా నిర్మాణ సంవత్సరాలను రూపొందించింది మరియు నా ప్రయాణానికి పునాది వేసింది. ఈ గౌరవప్రదమైన సంస్థతో నా అనుబంధానికి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా, దాని భవిష్యత్తుకు ముందుకు రావడానికి మరియు సహకరించడానికి నేను కృతజ్ఞుడను.. అందుకే సంస్థతో నా 50 ఏళ్ల అనుబంధాన్ని పురస్కరించుకొని నా వంతు సహకారం అందిస్తున్నాను. సంస్థకు భవిష్యత్తులోనూ నా సహకారం ఉంటుంది. ఇది కేవలం ఆర్థికం సహాయం కాదు. నాకు జీవితం ఎంతో ఇచ్చిన సంస్థ పట్ల నాకున్న గౌరవం. రేపటి ప్రపంచాన్ని తీర్చిదిద్దనున్న విద్యార్థుల పట్ల నిబద్ధతని నందన్‌ నిలేకని పేర్కొన్నారు.

Read also: Kaumari Devi: పూర్వజన్మల నుంచి వెంటాడే దోషాలను తొలగించే “కౌమారీ దేవి” ఆరాధన

ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, ఇంజినీరింగ్ మరియు సాంకేతిక పరిజ్ఞానం యొక్క అభివృద్ధి చెందుతున్న రంగాలలో పరిశోధనలను ప్రోత్సహించడానికి మరియు IIT బాంబేలో లోతైన టెక్ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి ఈ విరాళం ఉద్దేశించబడింది. ఈ సహకారం భారతదేశంలో పూర్వ విద్యార్థి చేసిన అతిపెద్ద విరాళాలలో ఒకటని ఐఐటీ బాంబే పేర్కొంది. ఈ అవగాహనా ఒప్పందంపై నీలేకని మరియు ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌధురి బెంగళూరులో సంతకాలు చేశారు. ఈ చారిత్రాత్మక విరాళం IIT బాంబేని ప్రపంచ నాయకత్వ మార్గంలో నడిపిస్తుందని చౌదరి పేర్కొన్నట్లు సంస్థ ప్రకటన విడుదల పేర్కొంది. మా విశిష్ట పూర్వ విద్యార్థి నందన్ నీలేకని ఇన్‌స్టిట్యూట్‌కి తన పునాది, మార్గదర్శక సహకారాలను కొనసాగిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ చారిత్రాత్మక విరాళం IIT బాంబే వృద్ధిని గణనీయంగా వేగవంతం చేస్తుంది మరియు దానిని ప్రపంచ నాయకత్వ మార్గంలో దృఢంగా ఉంచుతుందని చౌదరి అన్నారు. గతంలోనూ ఆయన ఐఐటీ బాంబేకు రూ.85 కోట్లు విరాళంగా ఇచ్చారు. కేవలం ఆర్థికంగా అండగా ఉండడమే కాకుండా.. ఈ 50 ఏళ్లలో పలు హాదాల్లో సంస్థతో ఆయన అనుసంధానమయ్యే ఉన్నారు.

Exit mobile version