Kolkata Doctor Case: “నా అల్లుడిని ఉరితీయండి”.. నిందితుడి అత్త డిమాండ్..

  • నా అల్లుడిని ఉరితీయాలి..
  • నా కుమార్తె అనారోగ్యానికి కూడా అతనే కారణం..
  • కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడి అత్త డిమాండ్..
Kolkata

Kolkata

Kolkata Doctor Case: కోల్‌కతా ఆర్‌జీ కర్ కాలేజ్ ఘటన యావద్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల పీజీ ట్రైనీ వైద్యురాలిపై అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి, హత్య చేశాడు. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్యురాలిపై కాలేజీ సెమినార్ హాలులో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ కేసులో సంజయ్ రాయ్‌కి సంబంధించిన బ్లూటూత్ హెడ్‌ఫోన్ క్రైమ్ సీన్‌లో దొరగకడంతో ఇతనే నిందితుడని పోలీసులు తేల్చారు.

Read Also: Yuvraj Singh Biopic: యువరాజ్ సింగ్ బయోపిక్.. క్రికెట్ కెరీర్ నుంచి క్యాన్సర్ పోరాటం వరకు!

ఇదిలా ఉంటే, నిందితుడి అత్త తన అల్లుడిని ఉరితీయాలని డిమాండ్ చేసింది. నా కుమార్తెను అతను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి పెళ్లై రెండేళ్లు అయిందని, మొదట్లో 6 నెలలు అంతా బాగానే ఉందని, నా కుమార్తె 3 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో సంజయ్ రాయ్ కొట్టాడని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. అప్పటి నుంచి తన కుమార్తె అనారోగ్యంగానే ఉందని, ఆమె మందుల ఖర్చులన్నీ నేను భరించలేదని చెప్పారు.

నిందితుడు సంజయ్ రాయ్‌కి మొత్తం నాలుగు పెళ్లిళ్లు అయ్యాయని విచారణ తేలింది. అయితే, ఇతడి ప్రవర్తన కారణంగా ముగ్గురు భార్యలు ఇతడిని విడిచి వెళ్లారు. అసభ్య ప్రవర్తన కారణంగానే వారంతా రాయ్‌ని వదిలేసి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. నాలుగో భార్య గతేడాది క్యాన్సర్‌తో మరణించినట్లు వెల్లడించారు. నిందితుడు తాగిన మత్తులో తరుచూ అర్థరాత్రి ఇంటికి వచ్చేవాడని ఇరుగుపొరుగు వారు పేర్కొన్నారు.