Delhi High Court: లైంగిక చర్యలకు మహిళ అంగీకరించినప్పటికీ, ఆమె వీడియోలు, తీయడం నేరమే అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. లైంగిక చర్యల్లో పాల్గొనడానికి ఒక మహిళ అంగీకరించడాన్ని ఆమె అనుచిత వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి అంగీకారంగా పరిగణించలేమని తీర్పు చెప్పింది. ‘‘శారీరక సంబంధాలలో పాల్గొనడానికి అంగీకరించడం అనేది ఒక వ్యక్తి యొక్క ప్రైవేట్ క్షణాలను దుర్వినియోగం చేయడం లేదా దోపిడీ చేయడం లేదా వాటిని అనుచితంగా మరియు అవమానకరమైన రీతిలో చిత్రీకరించడం వరకు అంగీకరించదు’’ అని జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం జనవరి 17న మంగళవారం విడుదల చేసిన తీర్పులో పేర్కొంది.
2024ఒక ఒక మహిళ దాఖలు చేసిన అత్యాచారం కేసులో 26 ఏళ్ల వ్యక్తికి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు వ్యక్తి తనకు రూ. 3.5 లక్షల అప్పు ఇచ్చాడని, కానీ ఆ తర్వాత తనను బ్లాక్‌మెయిల్ చేస్తూ, లైంగిక డిమాండ్లను నెరవేర్చాలని బలవంతం చేశాడని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. వీడియో కాల్ సమమయంలో ఆ వ్యక్తి తనను దుస్తులు విప్పమని ఆదేశించాడని, తన వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించడంతో తనతో బలవంతంగా సంబంధాలు ఏర్పరుచుకున్నాడని ఆమె పేర్కొంది. ఆ తర్వాత ఆ వ్యక్తి తన అనుచిత వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌పామ్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించినట్లు చెప్పింది.
Read Also: Minister Nimmala Ramanaidu: 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి.. నిర్వాసితులకు న్యాయం చేస్తాం..
హైకోర్టులో.. తనపై మోపబడిన ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయని, అబద్ధమని సదరు నిందితుడు చెప్పాడు. ఆ మహిళ తనతో ఏకాభిప్రాయంతోనే సంబంధం పెట్టుకుందని, డబ్బు విషయంలో వివాదం కారణంగా, డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతోనే మహిళ ఫిర్యాదు చేసినట్లు నిందితుడి తరఫు న్యాయవాది తెలిపారు. సదరు వ్యక్తి ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడమే కాకుండా ఆమె అనుచిత వీడియోలనున స్వాధీనం చేసుకున్నట్లు మహిళ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు ముందు చెప్పారు.
ఈ కేసులో నిందితుడికి జస్టిస్ శర్మ బెయిల్ తిరస్కరించారు. ఒక మహిళ ఏకాభిప్రాయంతో సెక్స్‌కి అనుమతించిన, ఆమె ప్రైవేట్ వీడియోలు తీసే హక్కు లేదని కోర్టు స్పష్టం చేసింది. నిందితుడు ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తూ, వీడియోలను పోస్ట్ చేస్తానని బెదిరించాడని, ఆమె దుర్భలత్వాన్ని ఉపయోగించుకున్నాడని కోర్టు పేర్కొంది. మొదటి లైంగిక చర్య ఏకాభిప్రాయంతో జరిగినప్పటికీ, ఆ తర్వాత ఒత్తిడి మేరకు అంగీకరించేలా బ్లాక్‌మెయిల్ చేసినట్లు కోర్టు గుర్తించింది. నిందితుడి చర్యలు దుర్వినియోగాన్ని, దోపిడీ వ్యూహాన్ని ప్రతిబింబిస్తున్నాయని కోర్టు పేర్కొంది.