
దేశంలో లాక్ డౌన్ తరహా ఆంక్షలు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్ ఆంక్షలు, మరికొన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక హర్యానా లో ప్రస్తుతం లాక్ డౌన్ అమలు జరుగుతున్నది. లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు అమలులో ఉన్న సమయంలో బయటకు వచ్చిన వారికి వెరైటీగా పోలీసులు శిక్ష విధిస్తున్నారు. అనవసరంగా రోడ్డు మీదకు వచ్చిన కొందరిని గుంజిళ్ళు తీయిస్తూ శిక్ష విధించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.