Site icon NTV Telugu

Harbhajan Singh: రైతు పిల్లల చదువు కోసమే నా జీతమంతా ఖర్చు చేస్తా

Harbhajan

Harbhajan

ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన ప్రముఖ మాజీ క్రికెటర్ హర్భజన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనకు రాజ్యసభ నుంచి వచ్చే జీతాన్ని రైతుల పిల్లల చదువు కోసమే ఖర్చు చేస్తానని హర్భజన్ స్పష్టం చేశాడు. ఒక రాజ్యసభ సభ్యుడిగా రైతుల కుమార్తెల విద్య, సంక్షేమం కోసం తన వేతనాన్ని వారికే ఇచ్చేస్తున్నానని హర్భజన్ ట్వీట్ చేశాడు. మన దేశం అభివృద్ధి చెందేందుకు తన వంతు సాయం చేస్తానని పేర్కొన్నాడు. దేశాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు హర్భజన్ తెలిపాడు. దేశం కోసం ఏదైనా చేస్తానని స్పష్టం చేశాడు. చివర్లో జైహింద్ అని కాప్షన్ పెట్టాడు.

కాగా హర్భజన్ ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికలకు ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరాడు. తొలుత అతడు బీజేపీలో చేరతాడని ప్రచారం జరిగింది. ఈ మేరకు హర్భజన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ కూడా సిద్ధమైంది. అయితే పంజాబ్‌లో పార్టీ పరిస్థితిని గమనించి బీజేపీ వెనక్కి తగ్గింది. దీంతో హర్భజన్ కాంగ్రెస్ పార్టీలో చేరతాడని అందరూ ఊహించారు. కానీ అతడు అకస్మాత్తుగా ఆప్‌లో చేరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలవడంతో ఆ పార్టీ హర్భజన్‌ను రాజ్యసభకు పంపింది.

Bharatiya Janata Party: నాలుగు రాష్ట్రాల ఉపఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి

Exit mobile version