Bihar: మహిళపై వేధింపులు.. అరగుండు, మెడలో బూట్ల దండతో ఊరేగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఈ వేధింపులు ఉంటున్నాయి. వేధింపుల స్థాయి పెరిగిపోయి అత్యాచారాలు, హత్యల వరకు వెళుతున్నాయి. అయితే కొన్ని ఘటనల్లో జరుగుతున్న వేధింపులు విచిత్రంగా ఉంటుంటాయి. అటువంటిదే ఈ ఘటన. మహిళను వేధించాడని ఒక యువకుడిని అరగుండు కొట్టించి.. బూట్ల దండవేసి అవమానించారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. మహిళను యువకుడు వేధించ లేదని.. మహిళే.. యువకుడిని వేధించిందని స్థానికులు చెప్పడం కొసమెరుపు. మహిళను వేధిస్తున్నాడని యువకునికి అరగుండు చేయించి మెడలో చెప్పుల దండేసి ఊరేగించిన ఘటన బీహార్‌లోని కతిహార్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆనంద్ అనే వ్యక్తి కబర్‌లోని ఓ పిండి మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పిండిమిల్లుకు సంబంధించిన విషయాల్లో యజమాని రాజీవ్ కుమార్ ఇంటికి రెగ్యులర్‌గా వెళ్తుండేవాడు. ఇలా వెళ్తున్న క్రమంలో రాజీవ్ భార్యతో అతనికి పరిచయం ఏర్పడింది. ఇద్దరు గత కొంతకాలంగా ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. అయితే ఉన్నట్లుండి ఆనంద్ తనను వేధిస్తున్నాడని ఆమె తన భర్తకు చెప్పింది. గత మూడు నెలలుగా సతాయిస్తున్నాడని, సమయం సందర్భం లేకుండా ఫోన్ చేస్తున్నాడని, ఇంటికి వస్తున్నానంటూ వేధిస్తున్నాడని భర్తకు చెప్పింది.
Read Also: Prabhas: యాడ దొరికిన సంతరా ఇది… సంపేత్తే సంపేయండి కానీ టెన్షన్ పెట్టకండి
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
భర్త కుటుంబ సభ్యులు ఆనంద్‌ను పట్టుకుని.. ఓ గుంజకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. తన భార్యను ఎందుకు వేధిస్తున్నావంటూ అర గుండు గీయించాడు. మెడలో పాత బూట్లతో చేసిన దండ వేసి ఊళ్లో ఊరేగించారు. అయితే అమాయకుడైన యువకుడిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఆ మహిళే ఆనంద్‌కు తరచూ ఫోన్ చేసేదని, ఇంటికి రావాలని పిలిపించుకునేదని చెప్పారు. ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని బాధితుడు చెబుతున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆనంద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇరుపక్షాలు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు అతడిని వదిలిపెట్టారు. ఎవరి తరపున ఫిర్యాదులు అందకపోవడంతోనే యువకున్ని వదలిపెట్టినట్టు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!