NTV Telugu Site icon

Azam Khan: “మేము ఎన్‌కౌంటర్ కావొచ్చేమో”.. యూపీ నేత ఆజం ఖాన్ కీలక వ్యాఖ్యలు..

Azam Khan

Azam Khan

Azam Khan: ఆజం ఖాన్.. ఒకప్పుడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని శాసించారు. ఎస్పీ కీలక నేతగా ఉన్న ఆజం ఖాన్, అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యూపీలో కీలకంగా వ్యవహరించారు. ఎప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చారో, అప్పటి నుంచి పాత కేసులు ఒకదాని తర్వాత ఒకటి ఆజం ఖాన్ ని చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఆయనకు ప్రాణభయం పట్టుకుంది.

Read Also: Chandrababu: ఈ కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్లి పోరాడాలని భువనేశ్వరిని నేను కోరాను..

తాజాగా ఆజం ఖాన్‌తో పాటు ఆయన కుమారుడు అబ్దుల్లాలను వేర్వేరు జైళ్లకు తరలించారు. ఆజం ఖాన్ ని రాంపూర్ జైలు నుంచి సీతాపుర్ జైలుకు తరలించగా.. ఆయన కుమారుడు హర్దౌ జిల్లా జైలుకు పంపించారు. ఇలా తరలించే క్రమంలో ‘‘ ఎన్ కౌంటర్ చేస్తారేమో.. ఏదైనా జరగొచ్చు’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇలా జైలు నుంచి తరలించే సమయంలో మీడియా వ్యక్తుల ముందు ఈ వ్యాఖ్యలు చేస్తూ.. పోలీస్ జీపులో కూర్చున్నారు.

నకిలీ జనన ధ‌ృ‌వీకరణ పత్రాల కేసులో అక్టోబర్ 18న ఉత్తర ప్రదేశ్ కోర్టు ఆజంఖాన్, అతని భార్య తంజీమ్ ఫాతిమా, అతని కుమారుడు అబ్దుల్లా ఆజంలను దోషులుగా తేల్చింది. ముగ్గురికి ఏడేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 15,000 జరిమానా విధించింది. ప్రస్తుతం తండ్రీ కొడుకులను వేర్వేరు జైళ్లకు తరలించగా.. భార్యను మాత్రం రాంపూర్ జైలులో ఉంచారు.