Shocking: వయాగ్రా ఓవర్ డోస్.. కాబోయే భార్య వచ్చే లోపే మృతి..
- సెక్స్ సామర్థ్యాన్ని పెంచే డ్రగ్స్ ఓవర్ డోస్..
- గురుగ్రామ్‌లో 29 ఏళ్ల యువకుడి మృతి..
- కాబోయే భార్యను కలవక ముందే మరణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: హర్యానా గురుగ్రామ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సె*క్స్ సామర్థ్యాలను పెంచే మందుల్ని తీసుకున్న తర్వాత 29 ఏళ్ల యువకుడు మరణించాడు. హైడోస్ తీసుకోవడం వల్లే గుండెపోటుతో మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.
Read Also: Anna Hazare: ‘‘ఆత్మపరిశీలన చేసుకోవాలి’’.. ఆప్‌పై అన్నాహజారే కీలక వ్యాఖ్యలు..
Also Read
మృతుడిని రోహిత్ లాల్‌గా గుర్తించారు. నాగ్‌పూర్‌కు చెందిన రోహిత్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాడు. గురుగ్రామ్ సెక్టార్-53 ప్రాంతంలో ఒక పీజీ గదిలో నివసిస్తున్నాడు. గురువారం ఉదయం అతడి సహోద్యోగి ఫోన్ చేసినా స్పందించలేదు. వీరిద్దరు కలిసి ఆఫీస్‌కు వెళ్తుంటారు. ఇంటి వద్దకు వెళ్లినా తలుపు తెరవలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, డోర్ పగలగొట్టి చూడగా, రోుహిత్ మరణించి ఉన్నాడు. గదిలో కొన్ని మందులు, హెల్త్ సప్లిమెంట్స్ లభించాయి.
ప్రాథమిక విచారణలో.. రోహిత్ తనకు కాబోయే భార్యను గదికి ఆహ్వానించినట్లు తెలిసింది. సెక్స్ సామర్థ్యాన్ని పెంచే మాత్రల్ని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల గుండెపోటుతో మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆమె రాక ముందే రోహిత్ మరణించినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నిర్వహించి, శరీరంలోని శాంపిళ్లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని అధికారులు చెప్పారు.
తాజావార్తలు
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?