Site icon NTV Telugu

Dog Attack: కుక్క దాడికి గురైన మహిళకు రూ.2 లక్షల పరిహారం

Dog Attack

Dog Attack

Gurgaon Woman To Get 2 Lakh Compensation After Being Attacked By Dog: కుక్క దాడిలో గురైన మహిళకు ఉపశమనం లభించింది. ఆగస్టు నెలలో గురుగ్రామ్ కు చెందిన ఓ మహిళపై పెంపుడు కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ కేసులో గాయాలపాలైన మహిళకు రూ. 2 లక్షల మధ్యంతర పరిహారాన్ని ఇవ్వాలని గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీజీ)ని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక మంగళవారం ఆదేశించింది. అయితే ఈ మొత్తాన్ని కుక్క యజమాని నుంచి కూడా రికవరీ చేయవచ్చని ఎంసీజీని ఫోరమ్ ఆదేశించింది.

Read Also: Russia: పోలాండ్ హై అలర్ట్.. రష్యా మిస్సైల్ అటాక్..

ఆగస్టు 11న స్థానికంగా ఇళ్లలో పనిచేసే మున్నీ అనే బాధితురాలు తన కోడలితో కలిసి పనికి వెళ్తుండగా వినీత్ చీకారాకు చెందిన కుక్క దాడి చేసింది. ఆమె తల, ముఖంపై తీవ్రంగా దాడి చేసింది కుక్క. తీవ్రగాయాలపాలైన ఆమెను వెంటనే గురుగ్రామ్ లోని సివిల్ ఆస్పత్రికి తరలిచంారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సప్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సివిల్ లైన్ పోలీసులు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అయితే దాడి చేసిన కుక్క జాతిని ‘ పిట్ బుల్’ ముందు పేర్కొన్నారు. అయితే ఆ జాతి ‘ డిగో అర్జెంటీనో’గా తరువాత యజమాని సమాచారం ఇచ్చాడు. కుక్కను కస్టడీకి తీసుకోవడంతో పాటు కుక్కను సొంత చేసుకున్న వినీత్ చికారా లైసెన్సులను రద్దు చేయాలని ఫోరం ఎంసీజీని ఆదేశించింది. 11 విదేశీ జాతులను నిషేధించాలని ఆదేశించింది. పెంపుడు కుక్కల కోసం మూడు నెలల్లో పాలసీలు రూపొందించాలని ఆదేశించింది.

డిగో అర్జెంటీనో వంటి కుక్కజాతిని పెంపుడు కుక్కగా పెంచుకుంటున్న కుక్క యజమాని చట్టాన్ని ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంసీజీ కావాలంటే కుక్క యజమాని నుంచి రూ. 2 లక్షలను వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ కేసులో బాధితురాలి తరుపున న్యాయవాది సందీప్ సైనీ వినియోగదారుల రక్షణ చట్టం- 2019 ప్రకారం ఫిర్యాదు చేశారు. బాధితురాలికి రూ. 20 లక్షల పరిహారం చెల్లించాలని కోరాడు. అమెరికన్ పిట్-బుల్ టెర్రియర్లు, డోగో అర్జెంటీనో, రోట్‌వీలర్, నియాపోలిటన్ మాస్టిఫ్, బోర్‌బోయెల్, ప్రెసా కానరియో, వోల్ఫ్ డాగ్, బాండోగ్, అమెరికన్ బుల్‌డాగ్, ఫిలా బ్రసిలీరో, కేన్ కోర్సో జాతుల కుక్కలను పూర్తిగా నిషేధించారు. ఈ జాతి కుక్కలను ఎవరైనా పెంచుకుంటే వెంటనే ఆ కుక్క జాతులను కస్టడీలోకి తీసుకోవాలని ఫోరమ్ ఆదేశించింది.

Exit mobile version