NTV Telugu Site icon

West Bengal: భార్యతో గొడవలు.. తుపాకీతో స్కూల్‌లో పిల్లలను బందీచేయాలనే ప్లాన్..

West Bengal

West Bengal

West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో స్కూల్ లోని విద్యార్థులను బందీలుగా చేసుకునేందుకు ఓ వ్యక్తి తుపాకీతో తరగతి గదిలోకి ప్రవేశించడం కలకలం రేపింది. ఈ ఘటన మాల్డా జిల్లాలోని ముచియా చంద్ కాలేజీలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తుపాకీతో తరగతి గదిలోకి ప్రవేశించి, అక్కడే కూర్చోని న్యూస్ పేపర్ చదవడం ప్రారంభించారు. దీంతో స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు.

Read Also: Operation Kaveri: సూడాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న 360 మంది భారతీయులు..

అప్రమత్తం అయిన పోలీసులు, ఓ టీంతో స్కూల్ వద్దకు చేరుకున్నారు. సదరు వ్యక్తి నుంచి కొన్ని బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పెట్రోల్ బాంబులుగా గుర్తించారు. సదరు వ్యక్తి మానసికంగా అస్థిరంగా ఉన్నట్లు తేలింది. తన భార్య, తన కొడుకును తీసుకెళ్లిందని, పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా ఎలాంటి సహాయం లభించలేదని విచారణలో వెల్లడించాడు. ప్రస్తుతం వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

మాల్డా ఎస్పీ ప్రదీప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. స్కూల్ లోకి ఎవరో దుండగుడు ప్రవేశించనట్లు మాకు సమాచారం వచ్చిందని, అతని వద్ద తుపాకీ ఉన్నట్లు తేలిసిందని, మేము అతనితో చర్చలు జరిపి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. భార్యతో ఉన్న సమస్యల కారణంగానే పిల్లల్ని బందీలుగా చేసుకోవాలని చూసినట్లు ఎస్పీ తెలిపారు.