NTV Telugu Site icon

Bholaa Movie: భార్యతో కలిసి సినిమా చూశాడు.. నచ్చలేదని చితకబాదాడు

Man Beats Wife Bholaa

Man Beats Wife Bholaa

Gujarat Man Watches Bholaa With Wife Beats Her For Wasting Money: ఏదైనా కొత్త సినిమా వచ్చినప్పుడు.. కుటుంబ సమేతంగా థియేటర్‌కి వెళ్తాం. ఒకవేళ సినిమా బాగుంటే, ఇంటికొచ్చిన తర్వాత కూడా కాసేపు చర్చించుకుంటాం. అదే నచ్చకపోతే మాత్రం.. అందులో ఉన్న లోపాల గురించి డిస్కషన్స్ చేస్తాం. అంతే.. కాసేపయ్యాక ఆ సినిమా సంగతులే మర్చిపోతాం. కానీ.. గుజరాత్‌లో మాత్రం ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సినిమా చూసొచ్చిన తర్వాత తనకు నచ్చకపోవడంతో, భార్యపై దాడి చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఆమె చెప్పడం వల్లే ఫలానా సినిమాకు వెళ్లామని, దాంతో తన డబ్బులు ఖర్చు అయ్యాయంటూ ఆ భర్త పేర్కొంటున్నాడు. ఏదేమైనా.. భర్త చేసింది తప్పు కావడంతో, అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Adipurush: మరో వివాదంలో ఆదిపురుష్.. తన ఆర్ట్ కాపీ కొట్టారంటూ..

గుజరాత్‌లోని భుజ్ టౌన్‌ నగర్ చక్లా ఏరియాలో అమర్‌సిన్హ్ మోద్, కృష్ణబా మోద్ అనే దంపతులు నివసిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో.. ‘భోలా’ సినిమాకు వెళ్దామని భర్తను భార్య అడిగింది. భార్య కోరికను కాదనలేక.. ఇద్దరు దగ్గరలోని ఒక థియేటర్‌కి వెళ్లి భోలా సినిమా చూశారు. అయితే.. ఈ సినిమా అమర్‌సిన్హ్‌కు ఏమాత్రం నచ్చలేదు. దీంతో.. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి భార్యని నిందించడం మొదలుపెట్టాడు. నువ్వు చెప్పడం వల్లే ఈ చెత్త సినిమాకు వచ్చామని, నీ వల్ల డబ్బులు అనవసరంగా ఖర్చయ్యాయంటూ ఆమెను తిట్టాడు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా భార్యాభర్తల మధ్య ఇదే తంతు కొనసాగింది. ఆమె కిచెన్‌లో రాత్రి భోజనం తయారుచేస్తుండగా.. ఆమెను తిడుతూ, పిడిగుద్దులు గుద్దుతూ ‘నీ వల్లే డబ్బులు వృధా అయ్యాయి’ అని గొడవ పడ్డాడు. తప్పు తనదేనని, గొడవ ఆపమని భార్య ఎంత ప్రాధేయపడినా.. భర్త మాత్రం వెనక్కు తగ్గలేదు. అతడు మరింత చెలరేగిపోయి, చంపేస్తానంటూ బెదిరించాడు.

China: యుద్ధానికి మేం సిద్ధం.. తైవాన్‌కు చైనా సవాల్

అదే బిల్డింగ్‌లో ఉంటోన్న కృష్ణబా అత్తయ్య.. వారి ఇంట్లో జరుగుతున్న గొడవ శబ్దాలు విని, ఇంటికొచ్చింది. కృష్ణబాను భర్త నుంచి రక్షించి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది. అమర్‌సిన్హ్ మోద్ కొట్టిన దెబ్బలకు ఆమె తీవ్ర గాయాలపాలైంది. చికిత్స తీసుకున్న మరుసటి రోజు కృష్ణబా తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమా నచ్చలేదని తనపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా బూతులు తిట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అమర్‌సిన్హ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Show comments