Site icon NTV Telugu

Gujarat: ఉద్యోగమో.. రామచంద్రా! హోటల్ ఉద్యోగానికి ఎగబడ్డ నిరుద్యోగులు

Ddee

Ddee

భారతదేశం ఆర్థికంగానూ.. అభివృద్ధిలోనూ దూసుకుపోతుందని నాయకులు ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ దేశంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తాజాగా గుజరాత్‌లో వెలుగులోకి వచ్చిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. తాజాగా వెలుగులోకి వచ్చిన దృశ్యాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హోటల్‌లో ఉద్యోగం కోసం వందలాది మంది నిరుద్యోగులు ఎగబడ్డారు. తోపులాటలో స్టీల్ గేటు కూడా ఊడి యువకులు కిందపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Tata Consultancy Services: టీసీఎస్ తొలి త్రైమాసిక ఆదాయం విడుదల..3నెలల్లో రూ.12000కోట్లు లాభం..

గుజరాత్‌లోని భరూచ్‌ అంకలేశ్వర్‌లో లార్డ్స్ ప్లాజా హోటల్‌లో 10 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 9న ఇందుకోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ చేపట్టింది. దీనికోసం వందలాది మంది నిరుద్యోగులు ఎగబడ్డారు. దరఖాస్తులు ఇచ్చేందుకు యువకులు పోటెత్తారు. తీవ్ర తొక్కిసలాట జరిగింది. దీంతో హోటల్ రెయిలింగ్ విరిగిపోయింది. అదృష్టవశాత్తూ తొక్కిసలాట సంఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హోటల్‌లో పని చేసేందుకు అవసరమైన అర్హత, పని అనుభవం ఉండాలని నోటిఫికేషన్‌లో కంపెనీ పేర్కొంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఉద్యోగం చేసేందుకు యువత ఆసక్తిగా ఉన్న ఉద్యోగాలు మాత్రం లేవంటూ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: ప్రజలకు సేవ చేస్తే భగవంతుడుకి చేసినట్టే.. అదే బాటలో సేవ చేస్తా..

Exit mobile version